Varun Tej : మెగాబ్రదర్ నాగబాబు ముద్దుల తనయుడు వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముకుంద సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకుల అలరిస్తున్నాడు వరుణ్. చేసిన రెండవ సినిమాతోనే భారీ హిట్ ను సొంతం చేసుకున్న వరుణ్ ఆ తర్వాత ఫిదా, తొలి ప్రేమ, అంతరిక్షం,F2, గద్దల కొండ గణేష్ వంటి చిత్రాలతో బిగ్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాల విజయం తర్వాత వరుణ్ తేజ్ క్రేజ్ మరింత పెరిగింది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న వరుణ్ తేజ్… వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
వరుణ్ తేజ్ విషయానికి వస్తే ఆయనకి హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టంమట. వరుణ్ తేజ్ తన సంపాదనతో నాలుగు కార్లు, గాయత్రి హిల్స్ లో ఓ గెస్ట్ హౌస్ కొనుక్కున్నాడట. ప్రస్తుతం వరుణ్ మణికొండలోని 9 కోట్ల విలువ చేసే విల్లాలో ఉంటున్నట్టు తెలుస్తుంది. సినిమాల ద్వారా వరుణ్ తేజ్ కోట్లాది రూపాయలు సంపాదించినట్టు తెలుస్తుండగా, త్వరలో మంచి అమ్మాయిని చూసి వివాహం కూడా చేయసుకోనున్నాడట. వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు వచ్చినా సరే… వరుణ్ తేజ్ తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నాడు.
ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. యాక్షన్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకు షూటింగ్ పూర్తి అయింది. అలాగే, తన 13వ సినిమాను కూడా వరుణ్ ఇప్పటికే ప్రకటించాడు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రాబోతున్న ఈ చిత్రాన్ని శక్తి ప్రతాప్ సింగ్ హడా రూపొందిస్తున్నాడు. ఎయిర్‌ఫోర్స్ వార్ బ్యాగ్‌డ్రాప్‌తో ఈ మూవీ రాబోతుంది. అంతేకాదు, భారత వైమానిక దళానికి చెందిన అభినందన్ వర్థమాన్ కథతో ఇది తెరకెక్కుతోందని తెలిసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…