Varun Tej : టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి ఆపరేషన్ వాలెంటైన్ కాగా, ఈ చిత్రం పాన్ ఇండియా కథాంశంతో వార్ డ్రామా నేపథ్యంలో వస్తుంది. శక్తి ప్రతాప్ సింగ్ హడ డైరెక్షన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం)కు డెడికేట్ చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్‌గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది.ఫిబ్రవరి 6 నాడు ఆపరేషన్ వాలెంటైన్ మూవీ నుంచి గగనాల అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
ఇందుకోసం మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు వరుణ్ తేజ్ సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలోనే “మీరు ఇప్పటివరకు చాలా సినిమాలు చేశారు కదా. మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు?” అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు వరుణ్ తేజ్.నిజానికి నా ఫేవరేట్ హీరోయిన్ అయిన లావణ్యను నేను వివాహం చేసుకున్నాను. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు సాయి పల్లవి అంటే కూడా ఎంతో ఇష్టం. ఇక లావణ్య త్రిపాఠికి నేనే ముందు లవ్ ప్రపోజ్ చేశాను” అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.
ఇక బాబాయ్ గురించి అడగగా, తన బాబాయ్ ఎప్పటికీ తన గుండెల్లో ఉంటాడని కూడా చెప్పాడు. అలానే చిరంజీవి గురించి కొందరు లేనిపోని తప్పుడు ప్రచారాలు చేయగా, వారికి కూడా గట్టిగా సమాధానం ఇచ్చాడు. ఒకే ఒక్క అవార్డ్ పద్మవిభూషణ్‌తో తన పెద్దనాన్న చిరంజీవిని విమర్శించే వారికి గట్టిగా బదులిచ్చారు. మొత్తానికి వరుణ్ తేజ్ సమాధానాలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాకు కుశక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించింది. మార్చి 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…