Rohit Sharma : ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించి.. హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించడంపై ఇప్పటికీ క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఫ్రాంచైజీని విజయవంతంగా ముందుకు నడిపిస్తూ.. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్స్ సాధించిపెట్టిన రోహిత్‌ని ఎందుకు సారథిగా పక్కకు తప్పించారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అయితే ఐపీఎల్ 2024 మినీ ఆక్షన్‌కు ముందే గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ విండో ద్వారా జట్టులోకి తీసుకుంది. పూర్తిగా క్యాష్ డీల్ ద్వారా అతన్ని జట్టులోకి తెచ్చుకోంది. ట్రేడింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యాను తమ సారథిగా ప్రకటించింది.
అయితే ఈ కెప్టెన్సీ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే.. ముంబై ఇండియన్స్ కోచ్ మార్క్ బోచర్ స్పందించాడు. రోహిత్ స్థానంలో హార్దిక్‌ని సారథిగా నియమించడానికి గల కారణాన్ని రివీల్ చేశాడు.ఇది పూర్తిగా ఓ క్రికెటింగ్ నిర్ణయం. ఒక ప్లేయర్‌గా హార్దిక్‌ని తిరిగి జట్టులోకి తీసుకోవడం కోసం మేము విండో పీరియడ్‌ని చూశాం. నాకు తెలిసినంతవరకు ఇది ఓ పరివర్తన దశ అని భావిస్తాను. అయితే.. చాలామందికి ఈ విషయం అర్థం కాకపోవడంతో భావోద్వేగానికి గురయ్యారు. కానీ.. ఆటకు సంబంధించిన విషయాల్లో భావోద్వేగాలను దూరం పెట్టాలి. రోహిత్ స్థానంలో హార్దిక్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం అనేది ఒక ఆటపరంగా తీసుకున్న నిర్ణయం మాత్రమే.
ఈ నిర్ణయం.. రోహిత్ శర్మను ఒక ప్లేయర్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు సహాయం చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇన్నాళ్లూ కెప్టెన్సీ అనే పంజరంలో బందీగా ఉన్న రోహిత్‌ను ఇప్పుడు స్వేచ్ఛగా పరుగులు చేయనివ్వండి’’ అని ఓ స్పోర్ట్స్ పోడ్‌కాస్ట్‌లో మార్క్ బౌచర్ చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్‌తోనే ప్రొఫెషనల్ కెరీర్‌ను ప్రారంభించిన హార్దిక్ పాండ్యా.. రెండేళ్ల విరామం తర్వాత సొంతగూటికి చేరాడు. అయితే హార్దిక్ పాండ్యా రాకను స్వాగతించిన అభిమానులు.. అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్ అభిమానులు మాత్రం ఈ విషయంపై చాలా సీరియస్ అవుతున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…