TDP And BJP : టీడీపీ, బీజేపీ పొత్తు ఫిక్స్‌..? ఎవ‌రికి ఎన్ని సీట్లు అంటే..?

TDP And BJP : ఏపీలో ఎన్నికల వేళ పొత్తుల లెక్కలు కీలకం అవుతున్నాయి. కొంత కాలంగా సస్పెన్స్ గా ఉన్న టీడీపీ, బీజేపీ పొత్తుపైన స్ఫష్టత మ‌రికొద్ది రోజుల్లో వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే జ‌గ‌న్‌ని ఓడించేందుకు జనసేనతో పొత్తు పెట్టుకోగా, దీంతో పాటుగా కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ చేరుతుందని గత రెండేళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు మోదీ విధానాలను సమర్థిస్తానని ఇటీవలి కాలంలో చాలా సార్లు ప్రకటించారు. అయోధ్య కూడా వెళ్లి వచ్చారు. అందుకే ఏపీలో మళ్లీ 2014 కూటమి ఖాయమన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది.

ఏపీలో వచ్చే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరగవని టీడీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. వ్యవస్థల్ని అదుపులో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు పాల్పడతారని నమ్ముతున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలంటే కేంద్రం మద్దతు ఉండాలని భావిస్తున్నారు. బీజేపీ తమకు మద్దతుగా ఉండకపోయినా… వైసీపీకి సపోర్ట్ గా ఉండవద్దని కనీసం న్యూట్రల్ గా అయినా ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. అందుకే తాము హితులమే అని చెప్పడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ ఉద్దేశం కూడా అదే అని అంటున్నారు.

TDP And BJP alliance is fix who will get how many seats
TDP And BJP

నమ్మకమైన మిత్రపక్షాలు బీజేపీకి దూరమయ్యారు. బీజేపీ రెండు సార్లు పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడానికి కారణం ఉత్తరాది… హింందీ రాష్ట్రాలు. అక్కడ 95 శాతం సీట్లు సాధించడం ద్వారానే ఢిల్లీ పీఠం దక్కింది. రెండు సార్లు జరిగిన అద్భుతం మూడో సారి జరగకపోతే సీట్ల కోత పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే బీజేపీకి ఇబ్బందికరం అవుతుంది. దక్షిణాదిపై ఆ పార్టీకి ఆశలు లేవు. అందుకే ఇప్పుడు బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షం కావాలి. వైసీపీ ఎలాగూ కూటమిలో చేరదు. టీడీపీకి కూటమిలో చేరే ఆప్షన్ ఉంది. నిజానికి టీడీపీ, బీజేపీ కలిసినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి. 2014లో బీజేపీతో కలిసి చంద్రబాబు పోటీ చేశారు. విజయం సాధించారు. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో కలిసి ఘోర పరాజయం పాలయ్యారు. అంతకు ముందు కూడా బీజేపీ, టీడీపీ కూటమిగా మారితే చాలా విజయాలు దక్కాయి.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago