Varun Tej : మరి కొద్ది రోజులలో మెగా ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలు ప్రేమలో మునిగి తేలుతున్నారని, వారు త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్టు ఇటీవల ప్రచారం నడిచింది. అయితే రీసెంట్‌గా వీరిద్దరి నిశ్చితార్థం జూన్ 9న హైదరాబాద్ లో జరగనుందనే వార్త బయటకు వచ్చింది.. ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంతమంది అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనున్నట్లు చెబుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియదు కాని ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు, ఎలా పుట్టింది అనే దానిపై అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. లావణ్య-వరుణ్‌ల మధ్య ప్రేమకు కారణం ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్లేనని అంటున్నారు. లావణ్య- వరుణ్‌లు 2017లో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సమయంలోనే లావణ్య- వరుణల మధ్య ప్రేమ పుట్టినట్లు తెలుస్తోంది. మిస్టర్ ప్రమోషన్ కార్యక్రమంలో లావణ్యతో కలిసి నటించిన వరుణ్ తేజ్ అప్పుడే చిన్న హింట్ ఇచ్చారని కూడా అంటున్నారు. పలు వీడియోలు షేర్ చేస్తూ ఈ వార్తలని వైరల్ చేస్తున్నారు.
సాధారణంగా సోషల్ మీడియా శ్రీను వైట్ల సినిమాల్లోని మీమ్స్ వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు శ్రీను వైట్ల మీదే మీమ్స్ చేస్తూ.. నెటిజన్లు ఫన్ జెనరేట్ చేస్తూ ఉన్నారు. లావణ్య త్రిపాఠి 1990 డిసెంబరు 15న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించింది. తండ్రి లాయర్ కావడంతో వృత్తి జీవితం కోసం కుటుంబమంతా ఉత్తరాఖండ్‌కు వెళ్లింది. దీంతో లావణ్య బాల్యమంతా అక్కడే గడిచింది. 2012లో వచ్చిన ‘అందాల రాక్షసి’ చిత్రంలో మిథునగా అమాయకపు అమ్మాయిగా తన నటనతో అలరించింది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న లావణ్య ఇప్పుడు మెగా ఇంటికి కోడలు కాబోతుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. చాలా అదృష్టవంతురాలివి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…