Varjun Tej And Lavanya Tripathi : వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి.. ఎంగేజ్‌మెంట్ ఫిక్స్‌..?

Varjun Tej And Lavanya Tripathi : సినిమా ఇండ‌స్ట్రీలో ప్రేమ వ్య‌వ‌హారాలు కొత్తేమి కాదు. చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మెగా హీరో ఓ హీరోయిన్ తో కలిసి ఏడడుగులు వేయబోతున్నట్లు తెగ‌ వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నటి లావణ్య త్రిపాఠీతో మెగా హీరో, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కొణిదెల ఎంగేజ్‌మెంట్ వచ్చే నెలలోనే జరగనున్నట్లు అతని సన్నిహిత వర్గాలు తెలిపాయంటూ పింక్‌విల్లా సైట్ తన రిపోర్టులో వెల్ల‌డించ‌డం చర్చ‌నీయాంశంగా మారింది.. ఈ ఇద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. ఆ స‌మ‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని అంటున్నారు. లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ నిశ్చితార్థం జూన్ లో జరగనుందని, ఈ ఏడాదిలోనే వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని స‌ద‌రు సంస్థ‌ తెలిపింది.

వరుణ్, లావణ్య చాలాసార్లు పార్టీలు, ఫ్యామిలీ వేడుకల్లో కలిసి కనిపించారు. కానీ తమ డేటింగ్ రూమర్లను మాత్రం ఖండిస్తూ వచ్చారు. తాము కేవలం స్నేహితులమే అని చెప్పారు. వరుణ్ చెల్లెలు నిహారికకు కూడా లావణ్య క్లోజ్ ఫ్రెండ్ ఆమె పెళ్లిలో కూడా లావ‌ణ్య త్రిపాఠి సంద‌డి చేసింది. అయితే ఈ ఎంగేజ్‌మెంట్ వార్తలను లావణ్య త్రిపాఠీ టీమ్ మాత్రం ఖండిస్తోంది. రీసెంట్ గా నిహారిక కొణిదెల ఇచ్చిన ఇంటర్వ్యూ లో ‘మా అన్నయ్య తో రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠి అంటే నాకు ఎంతో ఇష్టం,మా కుటుంబం లో జరిగే ప్రతీ ఫంక్షన్ కి ఆమె కచ్చితంగా ఉండాల్సిందే’ అంటూ చెప్పుకొచ్చింది.

Varjun Tej And Lavanya Tripathi engagement reportedly fix
Varjun Tej And Lavanya Tripathi

ఆ మ‌ధ్య నాగ బాబు వ‌రుణ్ తేజ్ పెళ్లి కూడా త్వ‌ర‌లోనే ఉంటుంద‌ని, స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు వ‌రుణ్ చెప్పుకొస్తాడు అని అన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవధారి అర్జున అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయాల్సి ఉంది. ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత వీటీ13లోనూ వరుణ్ ఓ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా కనిపించబోతున్నాడు. లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌స్తుతం పెద్ద‌గా సినిమాలు చేయ‌డం లేదు కాని సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

11 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

14 hours ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 day ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

4 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

4 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago