Hema : సీనియర్ నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాలలో నటించి అలరించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. పలు సినిమాల్లో ఆమె చేసిన పాత్రలను టీవీల్లో చూసినప్పుడు ఇప్పటికీ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు సినీ ప్రేక్షకులు. అయితే ఈ మధ్య ఆమె ఎక్కువగా సినిమాల్లో నటించటం లేదు. అడపా దడపా కొన్ని ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తుంది. ఆ మధ్య ఒక కార్యక్రమంలో హేమని సినిమాల్లో ఎందుకు నటించటం లేదు? అని ప్రశ్నిస్తే నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను. అందులో సంపాదన ఎక్కువై పోయి, సుఖ పడటం ఎక్కువ అలవాటు అయిపోయి, కష్టపడటానికి ఇష్టపడటం లేదంతే అంటూ సెటైరికల్‌గా మాట్లాడింది.
తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించిన హేమ అసలు పేరు కృష్ణవేణి. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తన పేరును హేమగా మార్చుకొని మంచి క్రేజ్ అందుకుంది.. 250 పైచిలుకు సినిమాల్లో నటించింది హేమ. నిర్మోహమాటంగా మాట్లాడే మనస్థత్వం కావడంతో… వివాదాల్లో కూడా ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మా ఎలక్షన్స్ సమయంలో.. ఆమె ప్రెస్ మీట్స్‌తో తెగ హోరెత్తించింది. ఇటీవల హేమకి సినిమా అవకాశాలు తగ్గాయి. హేమ పెద్దలను ఎదిరించి.. సయ్యద్ జాన్ అహ్మద్ అనే సినిమాటోగ్రాఫర్‌ను మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు ఇషా అనే కుమార్తె ఉంది. ఇషాకు ప్రజంట్ 22 సంవత్సరాలు. హీరోయిన్ అయ్యే అన్ని ఫీచర్స్ ఈషాకు ఉన్నాయి. అయితే సినిమాలపై ఇంట్రస్ట్ లేకపోవడంతో.. కుమార్తెను ఇండస్ట్రీకి దూరంగా పెంచింది హేమ. ఇటీవల తన ఆస్తలు గురించి స్పందించిన హేమ.. ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని, తన కూతురికి సెటిల్ చేసేటంత సంపాదించి ఉంచానని ఆమె తెలిపారు. తాను ఎక్కడున్నా నవ్వుతూ బతికేస్తానని, ఇదే కావాలి అన్నారు.. తాను ఇప్పటికీ గంజి అన్నం తింటానని, దానికి సూప్ రైస్ అని పేరు కూడా పెట్టుకున్నామని ఆమె చెప్పారు. తన కూతురు ఎప్పుడైనా సూప్ రైస్ కావాలంటే చేసి ఇస్తానని చెప్పింది. అందులో కొల్లాజెన్ ఎక్కువగా ఉంటుందని, దాని వల్ల స్కిన్ టైట్‌గా ఉంటుందని డాక్టర్స్ చెప్పడంతో తగ్గించాను అని చెప్పింది హేమ.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…