Vani Sri : ఒకప్పుడు ప్రేక్షకులని ఎంతగానో అలరించి సందడి చేసిన నటీ నటులు ఇటీవలి కాలంలో పెద్దగా కనిపించడం లేదు. వారి వారి ఇంటికే పరిమితం అవుతూ ఉన్నారు. అయితే ఏదైన వేడుకలలోనో లేదో,లేదంటే ఆలయ దర్శన సమయంలోనో వారు కనిపిస్తూ ఉంటారు. తాజాగా తిరుమల శ్రీవారిని అలనాటి నటి వాణిశ్రీ దర్శించుకున్నారు. భర్తతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
వాణిశ్రీ విషయానికి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్టీఆర్ , ఎ.ఎన్.ఆర్ నుంచి ఎందో అగ్ర కథానాయకుల చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లోని అగ్ర హీరోలందరితోనూ వాణిశ్రీ నటించింది. హీరోయిన్ తర్వాత సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లోనూ నటించారు వాణిశ్రీ. ఆ మధ్య వాణిశ్రీ తన స్థలం కబ్జాకి సంబంధించిన వార్తలలో నిలిచింది. వాణిశ్రీకి చెందిన స్థలం ఒకటి కబ్జాకి గురైంది. ఆ స్థలం విలువ రూ.20 కోట్లు. విషయాన్ని తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, తమిళనాడు ప్రభుత్వం వాణిశ్రీ భూమిని కబ్జా కోరల్లో నుంచి విడిపించారు. ఆభూమి పత్రాలను వాణిశ్రీకి అప్పగించారు స్టాలిన్.
ఇదే సందర్భంలో నకిలీ పత్రాలు, వ్యక్తుల ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తే దాన్ని రద్దు చేసే అధికారాన్ని ఆ శాఖకు కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. తన భూమిని తనకు అప్పగించిన స్టాలిన్ సాయానికి వాణిశ్రీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేలు మరచిపోలేనని అన్నారు.ఇక కథానుగుణంగా హీరోతో డాన్సులేయడం, రేప్ సీన్‌లో నటించడం వంటి సన్నివేశాలలో నటించేందుకు ఆసక్తి చూపలేదు వాణిశ్రీ. 1970 దశకాలలో ఆమె తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలారు. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల నుంచి తప్పుకున్నారు. 1980 దశకంలో తల్లి పాత్రలు వేస్తూ మళ్లీ వెండితెర మీద కనిపించారు. ఆ తరువాత ఇటీవల నాలుగైదేళ్ల కిందట బుల్లితెరమీద కూడా అరంగేట్రం చేశారు. కానీ ఎందుకో అది కంటిన్యూ చేయలేకపోయారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…