IT Employees : దేశీయ ఐటీ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలోనే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 52 వేల ఐటీ ఉద్యోగాలు ఖాళీ అయ్యాయి. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారతీయ ఐటీ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. దీని ఫలితంగానే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 51,744 మంది తమ ఉద్యోగాల నుంచి రోడ్డు మీద పడ్డారు. భారతదేశంలోని టాప్ 10 ఐటీ కంపెనీల్లో దాదాపు 21.1 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. కానీ సెప్టెంబర్ నాటికి వీరి సంఖ్య 20.6 లక్షలకు పడిపోయింది. కేవలం ఆరు నెలల కాలంలోనే ఐటీ కంపెనీలు దాదాపు 51,744 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి.
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో టాప్ 9 ఐటీ కంపెనీలు అయిన.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్పీసీఎల్ టెక్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, ఎంఫసిస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్టీఐమైండ్ట్రీలు దూసుకొస్తున్న ఆర్థిక మాంద్యం మధ్య తమ ఉద్యోగులను భారీ స్థాయిలో తగ్గించుకుంటూ వస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్ మాత్రమే కొత్తగా ఉద్యోగులను కంపెనీలోకి తీసుకుంది. ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్ 32 మందినే ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగాల్లోకి తీసుకున్నది. అయితే సంస్థ ఉద్యోగుల సంఖ్య ఎప్పుడూ లేనివిధంగా 22,265కి చేరింది.
విప్రో, టిసిఎస్ మరియు ఇన్ఫోసిస్ వంటి భారతదేశంలోని కొన్ని ప్రధాన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు ఈ ఏడాది జూన్, సెప్టెంబర్ మధ్య ఏకంగా 21,000 మంది ఉద్యోగులను తొలగించాయని ఎసెంట్ నివేదికలు సూచిస్తున్నాయి. క్యాంపస్ నియామకాలు కూడా ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. కోవిడ్-19 మహమ్మారితో నడిచే అన్ని డిజిటల్ వస్తువులకు డిమాండ్ పెరగడంతో ఈ సంక్షోభం ఎదురయింది.కరోనా మహమ్మారి కారణంగా 2020 ఏడాది పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. మహమ్మారి వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రావడంతో కొన్ని సంస్థలు హైబ్రిడ్ పద్ధతి ని అవలంభిస్తున్నాయి. వారానికి కనీసం రెండు, మూడు రోజులైనా కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. విప్రో కూడా తమ ఉద్యోగులకు ఇలాంటి సూచనే చేసింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే అని స్పష్టం చేసింది. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…