మెగా ఫ్యామిలీ హీరోలు మంచి వినోదం పంచుతూ ప్రేక్షకులని అలరిస్తూ వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.శంకర్ దాదా ఎంబీబీఎస్మూవీలో బాలనటుడిగా పరిచమైన వైష్ణవ్‌తేజ్.. ఉప్పెన సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు. తర్వాత కొన్ని చిత్రాలు చేసిన పెద్దగా హిట్ కాలేదు. ఇప్పుడు మంచి విజయం అందుకునేందుకు అతని కెరీర్ లో నాలుగో సినిమాతో వస్తున్నాడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ తన కెరీర్ లో నాలుగో సినిమాగా PVT04గా వచ్చిన సినిమా ‘ఆదికేశవస . తాజాగా ఈ టైటిల్ ను పరిచయం చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
గ్లింప్స్‌లో వైష్ణవ్ తేజ్ రుద్ర కాలేశ్వర్ రెడ్డిగా కనిపించబోతున్నాడు. టీజర్, మూవీ టైటిల్ చూస్తుంటే శివుని గుడికి సంబంధించిన కథగా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. మైనింగ్ కోసం తమ ఊరిలోని శివుడి గుడిని కూల్చేందుకు ప్రయత్నించేవారిపై హీరో పోరాడతాడని దీనిని బట్టి తెలుస్తోంది. ఈ మేరకు గుడిని కూల్చేందుకు వచ్చినవారిని చితకబాదే యాక్షన్ సీన్లలో చాలా ఇంటెన్సివ్‌గా కనిపించాడు వైష్ణవ్ తేజ్ . ఇందులో తను రుద్ర కాళేశ్వర్ రెడ్డి పాత్రలో నటిస్తుండగా.. ‘ఆది కేశవ’ టైటిల్ కూడా బాగుందని కొందరు చెప్పుకొస్తున్నారు.
గ్లింప్స్ లో ఆ గుడి జోలికి వెళ్లకండయ్యా.. వెళితే శివుడికి కోపం వస్తుంది అని ఓ పెద్దాయన చెబుతుంటే అది విన్న రుద్ర కాలేశ్వర్ రెడ్డి రౌడీలను కొడుతూ టీజర్ చూపించారు. వైష్ణవ్ తేజ్ స్టైలిష్ యాక్షన్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. గ్లింప్స్ మొత్తం ఆకట్టుకునేలా ఉండటమే కాకుండా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పించగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఎస్ నాగవంశీ, ఎస్ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా, జోజు జార్జ్ విలన్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో బీస్ట్ మూవీ ఫేమ్ అపర్ణ దాస్ మరో కీలక పాత్ర పోషిస్తోంది. మూవీ మంచి హిట్ అయ్యేలా కనిపిస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…