USA Vs PAK : ప‌సికూన‌పై చిత్తుగా ఓడిన పాకిస్తాన్‌.. నీళ్లు లేని బావిలో దూకండుంటూ ట్రోల్స్

USA Vs PAK : జూన్ 2 నుండి పురుషుల టి20 ప్రపంచకప్​ క్రికెట్​ పోటీ మొద‌లు కాగా, ఈ టోర్నీలో ప్ర‌తి మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. గురువారం టెక్సాస్​లో జరిగిన మ్యాచ్​లో జగజ్జేత పాకిస్తాన్​, పసికూన అమెరికా తలపడగా, ఇందులో అమెరికా జ‌ట్టు సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. టీ20ల్లో మేం తోపులు అని చెప్పుకునే పాకిస్థాన్ జ‌ట్టు ప‌సికూన చేతిలో ఓడిపోవ‌డాన్ని ప్ర‌తి ఒక్క‌రు తిట్టిపోస్తున్నారు. అమెరికా మేటి వీరులైన పాకిస్తాన్​ బ్యాటర్లకి ముచ్చెమ‌టు ప‌ట్టించ‌డం విశేషం. అమెరికా బౌలర్ల ధాటికి అసలు బ్యాటింగ్​ ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితి పాక్‌కి వ‌చ్చింది. తొలుత పాక్ బ్యాటింగ్ చేయగా, పవర్​ప్లేలో పాకిస్తాన్​ స్కోరు 30 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల‌లో ప‌డింది. బాబర్​ ఆజమ్​ (44) ఒక్కడే ఆచితూచి ఆడుతూ టి20ని టెస్ట్​మ్యాచ్​లా మార్చేసాడు.

ఇక రిజ్వాన్​(9), ఉస్మాన్​ఖాన్​(3), ఫఖర్​ జమాన్​(11), ఆజంఖాన్​(0)లు ఇలా వ‌చ్చి అలా వెళ్ఆరు. చివ‌ర‌లో షాదాబ్​ ఖాన్​(25 బంతుల్లో 40 పరుగులు) ఎడాపెడా బాదడంతో జట్టు స్కోరు వంద దాటింది. ఇక‌ అఫ్రిదీ కూడా బ్యాట్​ ఝళిపించడంతో పాకిస్తాన్​ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగలిగింది. అమెరికా బౌలర్లలో కెంజిగే 3 వికెట్లతో రాణించగా, సౌరభ్​ నేత్రావల్కర్​ 2, అలీ ఖాన్​, జస్​దీప్​సింగ్​ చెరో వికెట్​ తీసుకున్నారు. ఇక 160 ప‌రుగుల ల‌క్ష్యంతో అమెరికా బ‌రిలోకి దిగింది. ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్​ మోనాంక్​ పటేల్​, స్టీవెన్​ టేలర్​(12)లు తొలి వికెట్​కు 36 పరుగులు జోడించగా, తర్వాత వచ్చిన ఆండ్రీస్​ గౌస్(35)​తో కలిసి మోనాంక్​ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. అర్థసెంచరీ సాధించిన మోనాంక్​(50) మహమ్మద్​ ఆమిర్ బౌలింగ్​లో ఔటవ్వగా, తొలి మ్యాచ్​లో దంచికొట్టిన ఆరొన్​ జోన్స్(36)​, నితీశ్​ కుమార్​(14)లు మరో వికెట్​ పడకుండా సరిగ్గా 159 పరుగులు చేసారు.

USA Vs PAK cricket fans troll pakistan for their play
USA Vs PAK

రెండు జ‌ట్ల స్కోర్లు స‌మం కావ‌డంతో సూప‌ర్ ఓవ‌ర్ ఆడారు.సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. మొదటి మూడు బంతులకు అమీర్ ఏడు పరుగులే ఇచ్చాడు. కానీ ఆ తర్వాత లయ త‌ప్పి ఏడు పరుగులను వైడ్ల రూపంలోనే సమర్పించుకున్నాడు. ఇక సూపర్ ఓవర్ ఛేదనలో 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ వికెట్ కోల్పోయి 13 పరుగులే చేసింది. సౌరభ్‌ నేత్రావల్కర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో ప‌రుగులు రావ‌డం క‌ష్టమైంది. అయితే ఇంత దారుణంగా ఓడిపోవ‌డంతో . దాయాది జట్టుపై ఆ దేశ క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా మండిపడుతున్నారు. ఫస్ట్ టైం వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడుతున్న అమెరికా చేతిలో పాక్ ఓడిపోవ‌డం దారుణం అని, నీళ్లు లేని బావిలో దూకండి అంటూ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago