Naga Babu : ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెలుపుతో ప‌ట్ట‌రాని ఆనందంలో నాగ‌బాబు..!

Naga Babu : దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూసిన‌ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుద‌ల అయ్యాయి. రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయోనన్న టెన్షన్ పార్టీల అధినేతలు, అభ్యర్ధులు, కార్యకర్తల్లో ఉండ‌గా, ఎట్ట‌కేల‌కి ఏపీ ఫ‌లితాలు వ‌చ్చాయి. కూటమి ప్ర‌భుత్వం మంచి విజ‌యం సాధించింది. ఎవ‌రు ఊహించ‌ని విధంగా పార్టీ ఫ‌లితాలు రాబ‌ట్టింది. ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంట్ స్థానాల్లోనూ విజ‌యం సాధించింది. జ‌న‌సేనాని పోటీచేసిన పిఠాపురంలో వైసీపీ అభ్య‌ర్థి వంగా గీత‌పై ఏకంగా 70వేల‌కు పైగా మెజారిటీతో గెల‌వ‌డం విశేషం. ఇలా ప‌వ‌ర్‌స్టార్ ఈసారి ఎన్నిక‌ల్లో వ‌న్‌మ్యాన్ షోతో దూసుకెళ్లారు.

ఇక పిఠాపురంలో పవ‌న్‌ గెలుపుపై ఆ పార్టీ నేత నాగ‌బాబు తాజాగా ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. ఈ గెలుపు లక్ కాదు, లాటరీ అంతకంటే కాదు అన్నారు. ఈ విజ‌యం పిఠాపురం ప్ర‌జ‌ల‌ అభిమానానికి బహుమానం అని ఆయ‌న పేర్కొన్నారు. దిగ్విజ‌యంతో మా భారం దించింది మీరే, ఓటేసి మాపై బాధ్యత పెంచింది మీరే అని ఓట‌ర్ల‌ను ఉద్దేశించి నాగ‌బాబు అన్నారు. భరోసాతో నిలబెట్టారని తెలిపారు. బాధ్యతతో కాదు భయంతో పనిచేస్తాం, పని చేయిస్తామ‌న్నారు. పిఠాపురం పురోగతికి సేనాని సిగ్నేచర్ పెడతామంటూ నాగ‌బాబు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి తమ్ముడి వెంటే నాగబాబు ఉన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతుగా కృషి చేశారు. నాగబాబు గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేశారు. కానీ వైసీపీ ప్రభంజనంలో ఆయన ఓడిపోయారు.

Naga Babu very much happy after pawan kalyan win
Naga Babu

అయినప్పటికీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ.. తమ్ముడికి అండగా నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ పొత్తు ధర్మంతో పవన్‌ కల్యాణ్‌ ఆ సీటును బీజేపీకి త్యాగం చేశారు. దీంతో ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ జనసేన విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ముఖ్యంగా పిఠాపురంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు కూటమి విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది కాబట్టి.. తన సోదరుడికి ఎలాగైనా మంచి పదవి అప్పగించాలని పవన్‌ కల్యాణ్‌ చూస్తున్నారని.. అందుకే టీటీడీ చైర్మన్ పదవిని నాగబాబుకు ఇవ్వాలని చంద్రబాబును అడిగారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నాగబాబు స్పందించి అదంతా వట్టి ప్రచారమేనని స్పష్టంచేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago