Urfi Javed : ఉర్ఫీ జావెద్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెగ అందాలు ఆరబోస్తూ నానా రచ్చచేస్తుంటుంది. బాలీవుడ్ సీరియల్ నటి అయిన ఉర్ఫీ జావెద్ ఎప్పుడూ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. పలు హిందీ సీరియల్స్‌లో నటించిన ఈమె ఆడియెన్స్‌లో గుర్తింపు కోసం ఏవేవో చేస్తూ ఉంటారు. హిందీ బిగ్‌బాస్ సీజన్-1లో కంటెస్టెంట్‌గా వచ్చిన తర్వాత నుంచి ఆమె క్రేజ్‌ను సంపాదించుకంది. ఆ తర్వాత దుస్తుల ధరించడంలో వినూత్నంగా ప్రవర్తిస్తుంటుంది. బోల్డ్ అవుట్ ఫిట్లలో పబ్లిక్‌లో తిరుగుతూ ఉర్ఫీ జావెద్ హంగామా చేస్తూ ఉంటుంది. అయితే.. ఉర్ఫీ జావెద్‌కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అయ్యింది.
మొదటి నుంచి వివాదాస్పద యువతిగా పేరు తెచ్చుకున్న ఉర్ఫీ ఉత్తరప్రదేశ్‌లోని ఓ ముస్లిం కుటుంబంలో పుట్టి పెరిగింది. తన డిగ్రీ అనంతరం సీరియల్స్‌లలో నటిస్తూ తోటి యాక్టర్‌తో కొన్నాళ్లు సహజీవనం చేసి బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత నేను ముస్లిం, హిందూ మతాలను అనుసరించనని, ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోనంటూ 2021లో వివాదాల్లో ఎక్కింది. ఇక అప్పటినుంచి రోజూ ఎక్కడో ఓ చోట తన వింత ప్రవర్తనలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నది. అడపాదడపా వెబ్‌సీరిస్‌లలో నటిస్తూ, హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 1లో పాల్గొని అందులో తనదైన వెరైటీ డ్రెస్సింగ్‌తో యువతలో పేరు సంపాదించింది.
ముస్లిం కుటుంబంలో పుట్టి వారి పరువు, మర్యాదలను నాశనం చేస్తున్నదని కొంతమంది, దేశ సంస్కృతి, సాంప్రదాయాలను మట్టు బెడుతున్నదంటూ మరి కొంతమంది దుయ్యబడుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు, సంఘాలు ఈమెపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ చాలామంది స్టేషన్‌లో కంప్లైంట్లు ఇవ్వడం, లెటర్స్ రాయడం కూడా జరిగింది. అయితే ఉర్ఫీ జావెద్ ఓ రెస్టారెంట్‌లో ఉండగా ఇద్దరు ముంబయ్ మహిళా పోలీసులు ఆమెను ఆరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. చివరకు ఈ వీడియోపై ముంబై పోలీసులు స్వయంగా స్పందించారు. అది ఫేక్ వీడియో అంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. ఈవీడియో వైరల్ కావడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. పబ్లిసిటీ కోసం చట్టాన్ని ఉల్లంఘించరాదంటూ వార్నింగ్ ఇచ్చారు. అలాగే పోలీసు యూనిఫాంను కూడా దుర్వినియోగం చేశారంటూ వెల్లడించారు ముంబై పోలీసులు. తప్పుదారి పట్టించే వీడియోలో ఉన్న వారిపై సెక్షన్ 171, 419, 500, 34 ఐపిసి కింద క్రిమినల్ కేసు నమోదు చేయబడిందని చెప్పారు. వాహనం కూడా స్వాధీనం చేసుకున్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…