Pawan Kalyan : వరుణ్‌తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్ 1న వివాహం బంధంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 1వ తేదీన అక్కడి కాలమానం ప్రకారం రాత్రి 2.48 నిమిషాలకు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.18 గంటలకు వివాహం జరిగింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ ప్రేమ ఎక్కడ చిగురించిందో అక్కడే దానికి వైవాహిక బంధాన్ని బిగించేందుకు సిద్దమయ్యారు. ఇటలీలోని 8వ శతాబ్దానికి చెందిన అతీ ప్రాచీన గ్రామాన్ని తమ వివాహ బంధానికి సాక్ష్యంగా చేసుకొన్నారు. వీరి వివాహం ఇటలీలోని బోర్గో సాన్ ఫెలీస్‌లో జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరిగే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహానికి దాదాపు 120 మంది అతిథులను ఎంపిక చేశారు.
కొణిదెల ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీతోపాటు లావణ్య కుటుంబ సభ్యులు ఈ వివాహం కోసం రెండు రోజుల ముందే ఇటలీకి చేరుకొన్నారు. అతిథులందరికీ రాయల్‌గా వసతులును ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా సాగిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి సంబంధించిన పెళ్లి కార్యక్రమాలకు నవంబర్ 1వ తేదీ రాత్రికి ముగిసాయి. 30వ తేదీన కాక్ టెయిల్ పార్టీ, 31వ తేదీన మెహందీ, హల్దీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నవంబర్ 1వ తేదీన రాత్రి వారిద్దరి పెళ్లిని వేద పండితులు ఘనంగా నిర్వహించారు.ఇక వరుణ్ తేజ్, లావణ్య వివాహానికి పవన్ కల్యాణ్ దంపతులు రెండు రోజుల ముందే ఇటలీకి చేరుకొన్నారు. తన భార్య లెజెనోవాతో కలిసి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏపీ, తెలంగాణలో రాజకీయ పరిస్థితుల కారణంగా బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ తన ఫ్యామిలీ కోసం సమయాన్ని కేటాయించి ఇటలీకి చేరుకొన్నారు.
ఏపీలో నెలకొన్న విచిత్ర పరిస్థితుల నేపథ్యంలో పవన్ పెళ్లికి వెళతారా లేదా అనే సందేహం అందరిలో ఉంది. కాని పవన్ తన సతీమణిని తీసుకొని ఇటలీలోని వరుణ్ తేజ్ వివాహానికి వెళ్లారు. చాలా కార్యక్రమాలు, షూటింగులు రద్దు చేసుకొని ఇటలీకి వెళ్లారు. పవన్ రాకతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయారు. వరుణ్, లావణ్య దంపతులకి భారీ గిఫ్ట్ కూడా ఇచ్చినట్టు సమాచారం. ఇక పెళ్లి ముగిసాక పవన్ ఒక్కడే హైదరాబాద్‌కి వచ్చినట్టు తెలుస్తుంది. సాయి ధరమ్ తేజ్ ఫ్యామిలీ కూడా హైదరాబాద్ చేరుకున్నారు.నవంబర్ 5న రిసెప్షన్ ఉండనుండగా, ఆ వేడుకలో పాల్గొంటారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…