Chandra Babu : స్కిల్ స్కాంలో అరెస్టైనా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎట్టకేలకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు బెయిల్ రావడంతో యాభై రోజుల టీడీపీ నేతల నిరీక్షణకు తెరపడినట్లు అయింది. చంద్రబాబు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చంద్రబాబుకు ఇప్పట్లో బయటకు రావడం కష్టమని టీడీపీ నేతలు భావించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ కోర్టు అనుహ్యంగా చంద్రబాబుకు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం మనం చూసాం. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మంగళవారం విడుదలైన చంద్రబాబు బుధవారం హైదరాబాదులోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనను ఏఐజీ వైద్యుల బృందం కలిసి ఆరోగ్య పరిస్థితిపై పరీక్ష చేసింది.
ఓసారి ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని చంద్రబాబుకు డాక్టర్లు సూచించడంతో ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు… ఆయన ఆసుపత్రిలో చేరితే బాగుంటుందని తెలిపారు. వైద్యుల సూచనతో చంద్రబాబు ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆయనకి పలు పరీక్షలు చేసిన తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి ఉన్నారు. జైలులో ఉన్న సమయంలో చంద్రబాబుకి తీవ్రమైన అలర్జీ, ఇతర అనారోగ్య సమస్యలు రావడంతో బెయిల్‌పై బయటకు వచ్చారు.
చంద్రబాబు బయటకు రావడంతో..న్యాయం గెలిచింది, ధర్మం నిలిచిందని టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాను హోరెత్తిస్తుండగా, చంద్రబాబు హెల్త్ ఇష్యూస్ మీదనే ఈ బెయిల్ వచ్చిందనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు బెయిల్ విషయంలో జనసేన కార్యకర్తలు సరికొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు.చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్ ఉంటే.. బెయిల్ రావడం వెనుక తమ నాయకుడు పవన్ కల్యాణ్ ఉన్నారని జనసేన కార్యకర్తలు అంటున్నారు. జగన్ ఇంగ్లాండ్‌లో ఉండి చంద్రబాబును అరెస్ట్ చేయిస్తే… పవన్ ఇటలీలో ఉండి బెయిల్ ఇప్పించారని వైసీపీ నాయకులకు జనసేన కార్యకర్తలు గట్టిగానే కౌంటరిస్తున్నారు. జగన్‌ను పవన్ కల్యాణ్ దెబ్బకు దెబ్బ తీశారని పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…