CM YS Jagan : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. చంద్రబాబు, పవన్ కలిసి జగన్‌ని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు బయట ఉంటే పరిస్థితి కష్టమవుతుందని ఆయన జైలులో పెట్టించారు. ఇప్పుడు ఆయన అనారోగ్యకారణాల వలన బయటకు వచ్చారు. అయితే చంద్రబాబు అరెస్ట్ అయి బయటకు వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారాయని అంటున్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అందుకే స్కిల్ డెవలె్‌పమెంట్ పేరుతో తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును జైల్లో అక్రమంగా నిర్భందించారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ప్రజల పక్షాన పోరాడేవారిపై, ప్రభుత్వ తప్పులు ప్రశ్నించిన వారిపై జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయ డం దారుణమని, అక్రమ అరెస్ట్ చేసారని కొందరు కామెంట్ చేస్తున్నారు.
చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ శ్రేణులు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం నేతలు మునుపెన్నడూ లేని విధంగా యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు. ఇక, ప్రభుత్వంపై సమరశంఖమే అనే భావన కలుగుతుండగానే ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది. టీడీపీలో ఉత్సాహం ఏ మాత్రం గిట్టని వైసీపీ సర్కార్ మాత్రం దాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. చంద్రబాబు విడుదల సందర్భంగా ఎటువంటి రాజకీయ ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలు చేయకూడదని, కనీసం మీడియాతో కూడా మాట్లాడకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని జగన్ సర్కారు ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. ర్యాలీలు, ప్రసంగాలు వంటి వాటితో శాంతిభద్రతలకి విఘాతం కలుగుతుందని, అందుకే చంద్రబాబుని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.
చంద్రబాబు బయట ఉన్నా బెయిల్ షరతుల పేరిట ఆయన్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం న్యాయస్థానాలను ఆశ్రయించడం చూస్తే.. ప్రభుత్వం ఎంతలా భయపడుతుందో అర్ధమవుతుంది. స్కిల్ కేసులో ఈసారి కోర్టు తప్పకుండా చంద్రబాబుకు బెయిల్ ఇస్తుందని భావించిన సీఐడీ.. అప్పటికప్పుడు మద్యం కేసును తెరపైకి తెచ్చింది. ఇలా చంద్రబాబుని ఎదుర్కోలేక జగన్ కుట్రలు పన్నుతున్నాడని కొందరు టీడీపీ నాయకులు చెప్పుకొస్తున్నారు. నవంబర్ 1 నుంచి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రారంభమవుతుందని, నియంత పాలనపై క్షుణ్ణంగా చెప్పి ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నం చేస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…