Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కోట్లకు పడగలెత్తిన కూడా ఎంతో ఒదిగి ఉంటుంది. అయితే త్వరలో తల్లి కాబోతున్న ఉపాసన తాజాగా ఓ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ. తాము పిల్లల్ని కనే విషయంలో ఎందుకు ఆలస్యం చేయాల్సి వచ్చింది? అందుకు ప్రధాన కారణాలేంటి? అనే విషయాలు బయటపెట్టారు. ”సమాజం కోరుకున్నప్పుడు కాకుండా నేను తల్లిని కావాలనుకున్నప్పుడు గర్భం దాల్చడం ఎంతో ఉత్సాహంగా, గర్వంగా ఉందని పేర్కొంది.. వివాహమైన పదేళ్ల తర్వాత మేం బిడ్డలను కనాలని అనుకున్నాం. ఎందుకంటే ఇది సరైన సమయం. మేమిద్దరం మా రంగాల్లో ఎదిగాం. ఆర్థికంగా బలోపేతమయ్యాం. మా పిల్లలకు కావాల్సినవన్నీ ఇచ్చే స్థాయికి చేరాం” అని ఉపాసన చెప్పుకొచ్చింది.
ప్రెగ్నెన్సీ ఆలస్యంపై మాట్లాడుతూ.. ఇది తమ ఇద్దరి నిర్ణయమని అన్నారు. ఈ విషయంలో అటు సమాజం, ఇటు కుటుంబం, బంధువుల ఒత్తిడికి తలొగ్గలేదని చెప్పారు. ఇది తమ మధ్య ఉన్న బలమైన బంధాన్ని చెప్పడంతో పాటు, పిల్లల విషయంలో తమకున్న స్పష్టతకు నిదర్శనమని ఉపాసన చెప్పుకొచ్చారు. పెళ్లి అయిన కొత్తల్లో నేను లావుగా ఉన్నానని, అందంగా లేనని, డబ్బులు కోసమే చరణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని విమర్శలు చేశారు. అలా విమర్శలు చేసిన వారిని నేనేమీ అనదలుచుకోవటం లేదు అని చెప్పుకొచ్చింది . పదేళ్ల కాలంలో నేనేంటో వారికి తెలిసింది.
విమర్శలను ఎదుర్కోవటం వల్ల నేను ఇంకా ధైర్యవంతురాలిగా మారాను అని ఉపాసన పేర్కొంది. ఇక తనకి రామ్ చరణ్‌కి కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరం ప్రాక్టికల్‌గా ఆలోచిస్తుంటాం. వ్యక్తిగా తను ఏదో విషయంలో ఎప్పుడూ నాకు ఛాలెంజ్ విసిరేవాడు. నేను కూడా అంతే తనకు ఛాలెంజ్‌లను విసిరేదాన్ని. అలా ఎదుగుతున్న క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ‘ప్రేమలో పడటం కాదు.. ప్రేమలో వికసిస్తుంటావు’ అని చరణ్ నాతో అన్నాడు. తను చెప్పిన దాంట్లో నిజం ఉందనిపించింది. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. మా ఇద్దరివీ భిన్నమైన నేపథ్యాలున్న కుటుంబాలు అయితే మా అంటీ, సోదరి మా పెళ్లి విషయంలో కీలక పాత్రను పోషించారు. నమ్మకం, ప్రశంసలే కాదు.. రాజీ పడటం ద్వారా కూడా మా బంధాన్ని స్ట్రాంగ్‌గా చేసుకుంటూ వచ్చాం అని ఉపాసన పేర్కొంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…