Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య సమంత నాలుగేళ్లకే విడిపోయారు. ప్రస్తుతం ఎవరి దారులు వారు చూసుకున్నారు. అయితే కొన్నాళ్లుగా నాగ చైతన్య యంగ్ హీరోయిన్ శోభితతో డేటింగ్‌లో ఉన్నారంటూ తెగ ప్రచారాలు నడుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నాగ చైతన్య, శోభిత కలసి విదేశాల్లో షాపింగ్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఆ ఫోటో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారని తేలింది. దీనిపై నాగ చైతన్య గానీ, శోభిత గానీ అస్సలు స్పందించలేదు. కానీ వీరి ప్రేమ వ్యవహారంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాగచైతన్య, శోభిత కలసి లండన్ లో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ కావడంతో వీరి డేటింగ్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.
లండన్ లో జమావర్ లో డిన్నర్ డేట్ కు వెళ్లగా, అక్కడ చెఫ్ సురేందర్ మోహన్ నాగ చైతన్యతో ఫోటో దిగారు. సురేందర్ ఆ ఫోటోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా, అందులో బ్యాగ్రౌండ్ లో టేబుల్ వద్ద శోభిత కూర్చున్నట్టు కనిపిస్తోంది. దీంతో వీరిద్దరి రిలేషన్‌పై జోరుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ చెఫ్ ఆ పిక్ డిలీట్ చేయగా, అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే సమంత పుకార్లపై ప్రశాంతంగా మరియు పరిపక్వతతో స్పందించింది. ఆమె మాట్లాడుతూ, “ఎవరితో సంబంధం కలిగి ఉన్నారనే దాని గురించి నేను బాధపడటం లేదు.
ప్రేమ విలువ తెలియని వారికి ఎంతమందితో సంబంధం కలిగి ఉన్నపటికీ చివరికి కన్నీళ్లు మిగులుతాయి. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తన ప్రవర్తన మార్చుకుని అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది అని సమంత తన సన్నిహితులతో చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుండగా, ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలలో చాలా యాక్టివ్‌గా పాల్గొంటుంది. ప్రముఖ అమెరికన్ యాక్షన్ డ్రామా ‘సిటాడెల్’ యొక్క భారతీయ రీమేక్‌లో కూడా ఆమె వరుణ్ ధావన్‌తో కలిసి నటించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…