Upasana : రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా, అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్.సి రెడ్డి మనవరాలిగా, మెగా ఇంటి కోడలిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించింది ఉపాసన. ఇంటి బాధ్యతలను చూసుకుంటూనే ఫాండేషన్ వైస్ చైర్‌పర్సన్‌గానూ ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైద్య రంగంలో తనదైన సేవచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఉప్సీ. తాజాగా ఆమె చేసిన సేవలకి గాను ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన ‘మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆసియా 2022-23’ జాబితాలో ఉపాసన చోటు దక్కించుకున్నారు.
ఉపాసన కొణిదెల ఎకనామిక్ టైమ్స్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ కూడా చేశారు. ఇక దీనికి మెగా ఫ్యాన్స్ నుంచి, నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తున్న అత్యంత కొద్దిమందిలో ఉపాసన ఒకరని ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలోను ఉపాసన అనేక విషయాలలో సత్తా చాటింది. ఇక ఉపాసన ప్రస్తుతం గర్భిణీ. ఇంకొన్ని నెలల్లో ఉపాసన- రామ్‌చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అంటూ జాగ్రత్తలు చెబుతున్నారు నెటిజన్లు.
ఉపాసన ప్రస్తుతం అపోలో ఛారిటీకి వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూనే, ‘బి పాజిటివ్’ అనే హెల్త్ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా కూడా ఉన్నారు. చిన్న వయసు నుంచే వ్యాపార మెలకువలను నేర్చుకున్న ఉపాసన … పదిహేనేళ్లకే.. యు ఎక్స్చేంజ్ అనే సేవా సంస్థ నెలకొల్పి పాత స్కూల్ పుస్తకాలు సేకరించి పేద పిల్లలకు ఇచ్చేవారు. మురికివాడల్లో అనారోగ్యంతో బాధపడే చిన్నారులకు కూడా అపోలో హెల్త్ సిటీలో చికిత్స చేయించి అందరి ప్రశంసలు అందుకుంది. . ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2012, జూన్ 14న మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతుల తనయుడు రామ్‌చరణ్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం రామ్ చరణ్ తన15వ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.