Taraka Ratna Daughter : నందమూరి తారకరత్న అకాల మరణం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులని ఎంతగా కలిచి వేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నారా లోకేష్ పాదయాత్ర సమయంలో గుండెపోటుకు గురై దాదాపు 23 రోజులు పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 22వ తేదీన తుది శ్వాస విడిచారు. తారకరత్న వైద్యం విషయంలోనూ, తారకరత్న మరణించిన తర్వాత నిర్వహించిన కార్యక్రమాల విషయంలోనూ బాలయ్య ముందుండే అన్ని కార్యక్రమాలు నడిపించారు. అంతేకాదు ఆయన కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని, పిల్లల బాధ్యత తనదేనని, భర్త మరణించిన తీవ్ర ఆవేదనలో ఉన్న అలేఖ్య రెడ్డికి భరోసా ఇచ్చారు బాలయ్య.
కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న తారకరత్న మరణించడంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి, పిల్లలు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇటీవల తన భర్తకు సంబంధించి అలేఖ్య పలు పోస్ట్ లు చేయగా, ఇవి తెగ వైరల్‌గా మారాయి. ఇక తాజాగా తారకరత్న కూతురు ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. కూతురు నిష్క తండ్రితో కలిసి ఆడుకున్న ఆఖరి వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. హిందూపూర్‌కు వెళ్లడానికి ముందు కూతురితో కలిసి సరదాగా గేమ్ ఆడారు తారకరత్న.దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన నిష్క.. ‘గేమింగ్.. హిందూపూర్ వెళ్లడానికి ముందు రోజు సాయంత్రం ఓబు తో ‘ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
![Taraka Ratna Daughter : తండ్రి చివరి జ్ఞాపకాన్ని తలచుకుంటూ ఫుల్ ఎమోషనల్ అయిన తారకరత్న కూతురు Taraka Ratna Daughter nishka got emotional](http://3.0.182.119/wp-content/uploads/2023/03/taraka-ratna-daughter.jpg)
తండ్రీ కూతుళ్ల అనుబంధం ఇలాగే ఉంటుందంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తారకరత్న మరణించిన సమయంలో నిష్క తన తండ్రి లేరని తెలుసుకొని ఎంతో ఆవేదన చెందింది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె కన్నీటిని ఎవరు ఆపలేకపోయారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన ఫిబ్రవరి 18వ తేదీన తుదిశ్వాస విడిచిన తారకరత్న మరణం వారి కుటుంబానికి తీరని లోటు అనే చెప్పాలి.
View this post on Instagram