Natu Natu Song : మరి కొద్ది రోజులలో ఐపీఎల్ హంగామా జరగనుంది. కరోనా సమయం నుండి ఈ వేడుక దుబాయ్ లో జరుగుతూ వస్తుంది. అయితే ఈ సారి ఇండియలోని పలు ప్రాంతాలలో జరగనుండడంతో ఈ వేడుక కోసం ప్రతి ఒక్కరు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. మార్చి 31 నుండి ఈ ఐపీఎల్ హంగామా జరగనుంది. అయితే కరోనా కారణంగా ఐపీఎల్ వేడకని జరపని నిర్వాహకులు గతేడాది మాత్రం చివర్లో ముగింపు వేడుకలను నిర్వహించారు. ఆ వేడుకల్లో అతి పెద్ద ఐపీఎల్ జెర్సీని ఆవిష్కరించి రికార్డు సృష్టించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ డ్యాన్స్‌తో అదరగొట్టాడు.
ఇక ఈ సారి ఆరంభం వేడుకలను అట్టహాసంగా నిర్వహించి, క్రికెట్ అభిమానులకు కనుల విందును అందించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఇప్పటికే ఆరంభ వేడుకల్లో డ్యాన్స్ ప్రదర్శనలు ఇవ్వడానికి నేషనల్ క్రష్ రష్మిక మంధాన, తమన్నా భాటియాలతో ఒప్పందం చేసుకున్నట్టు ఇప్పటికీఏ వార్తలు వచ్చాయి. ఇక వీరితో పాటు ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఈ వేడుకలో అదరగొట్టబోతున్నారట. వారెవరో కాదు ఎన్టీఆర్- రామ్ చరణ్. ‘నాటు నాటు’ పాటను ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో ప్రత్యేకంగా ప్రదర్శించాలని బీసీసీఐ నిర్ణయించుకోవడంతో వారిద్దరు ఆ పాటకు తమ స్టెప్పులతో అదరగొట్టబోతున్నారని టాక్.
![Natu Natu Song : ఐపీఎల్ వేదికపై నాటు నాటు పాటతో రచ్చ లేపనున్న రామ్ చరణ్ - ఎన్టీఆర్ Natu Natu Song ram charan and jr ntr to perform in ipl 2023](http://3.0.182.119/wp-content/uploads/2023/03/natu-natu-song.jpg)
ఇప్పటికే ఈ ఇద్దరు స్టార్లతో సంప్రదింపులు జరిపినట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. నాటు నాటు పాటకు మరోసారి ఐపీఎల్ లాంటి బిగ్ స్టేజ్‌పై పాన్ ఇండియన్ స్టార్లు రామ్ చరణ్- ఎన్టీఆర్ కలిసి చిందులేయడం ఖాయం. అసలు ఆస్కార్ వేడుకలోనే ఈ ఇద్దరు కదం తొక్కాలని అనుకున్నారు. కాని అది కుదరలేదు. ఈ సాంగ్ లో ఇద్దరి హీరోలు ఒకే సింక్ లో స్టెప్పులు వేయించడానికి రాజమౌళి దగ్గర ఉండి చూసుకున్నాడు. అయితే వీరిద్దరి సింక్ కోసం జక్కన్న ఎంతో తాపత్రయపడినట్టు తెలుస్తుంది.