కోహ్లి హోట‌ల్ రూమ్‌లోకి దూరిన వ్య‌క్తి.. మొత్తం వీడియో తీసి పోస్ట్ చేశాడు..

టీమిండియా స్టార్‌ ప్లేయర్‌, మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లికి చేదు అనుభవం ఎదురైంది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో విరాట్‌ హోటల్‌ రూమ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. కోహ్లి రూమ్‌లోకి దూరిన ఓ అభిమాని.. రూమ్ మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విరాట్‌ తన వస్తువులను ఎలా జాగ్రత్తగా పెట్టుకున్నాడు, షూ కలెక్షన్స్‌, అతను వాడే వస్తువులు ఇలా ప్రతీది వీడియోలో చూపించారు. చివరకు వాష్‌ రూమ్‌ను సైతం చిత్రీకరించారు. దీనిపై కోహ్లీ స్పందించారు.

ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. ఈ వీడియో తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేదిగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానులు తమ ఫేవరెట్‌ ఆటగాళ్లను చూసేందుకు, కలిసేందుకు ఉత్సాహం చూపుతారనే విషయం నాకు తెలుసు. వారి ఆసక్తి, ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. అలాంటి అభిమానులను ఎప్పుడూ నేను అభినందిస్తాను. కానీ నా గదికి సంబంధించిన వీడియోను చూసి నేను షాకయ్యాను. ఇది నా వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉంది. నా హోటల్ రూమ్‌లో కూడా నాకు ప్రైవసీ లేకుంటే ఎలా..? ఇలాంటి అభిమానాన్ని నేను ప్రోత్సహించను.

unknown person breached kohli room and made video

ఆటగాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం ఏ మాత్రం భావ్యం కాదు. దయచేసి ఆటగాళ్ల ప్రైవసీని గౌరవించండి. మీ వినోదం కోసం వారిని ఆట బొమ్మల్లా పరిగణించొద్దు అంటూ అభిమానులను కోరాడు. ఇదిలావుండగా సౌతాఫ్రికాతో మ్యాచ్ కోసం టీమిండియా పెర్త్‌లోని క్రౌన్ పెర్త్ హోటల్‌లో బస చేసింది. ఇంత పెద్ద హోటల్‌లో అది కూడా ఆటగాళ్లు లేని సమయంలో ఆగంతకుడు గదిలోకి ప్రవేశించాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాగా ఈ ఘటనపై ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ స్పందించాడు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నాడు. అలాగే కోహ్లీ భార్య అనుష్కశర్మ కూడా ఇది చాలా దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Share
Usha Rani

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago