Undavalli Arun Kumar : గడిచిన ఏడాది కాలంగా ఈసారి ఏపీ రాజకీయాలు మంచి రసవత్తరంగా మారాయి.. మళ్లీ జగనేనా, లేదంటే బాబు దూసుకొస్తాడా, కాదు కాదు పవన్ సత్తా చాటుతాడు చూడు ఏ ఇద్దరు కలిసినా ఇదే మాట్లాడుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ తరుణం రానే వచ్చింది.. జగన్ సింగిల్‌గా, చంద్రబాబు.. పవన్, మోడీల సపోర్ట్‌తో కూటమి అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి చరిత్ర లిఖించిన జగన్ పార్టీ ఈసారి ప్రతిపక్ష హోదాకే దిక్కులేక అడ్రస్ గల్లంతయ్యింది. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ పాలన మరోసారి తమకొద్దని ప్రజలు తిరస్కరించారు. కూటమి విజయానికి చంద్రబాబు వ్యూహాలు, ఎత్తుగడలు, పలు అంశాలు దోహదం కారణం కావొచ్చు.. కానీ వీటికి మించి అసలైన శక్తి పవన్ కళ్యాణ్. నచ్చినా, నచ్చకున్నా ఈ విషయాన్ని ఒప్పుకుని తీరాలి.
జగన్ నిన్ను ఈసారి గెలవనివ్వను, అథ:పాతాళానికి తొక్కేస్తానన్న జనసేనాని చెప్పినట్లుగానే వైసీపీని మట్టికరిపించారు. ఈ సారి తన అభిమానులు, కాపు సామాజికవర్గం ఓటంలను గంపగుత్తగా కూటమికి తరలించడంలో పవన్ సక్సెస్ అయ్యారు. కేవలం జనసేనానిని చూసే 90 శాతం మంది కాపులు కూటమి అభ్యర్థులకు ఓట్లేశారని అంచనా. పవన్ అనే వ్యక్తి లేకుంటే వార్ వన్ సైడ్ అయ్యేది కాదని, జగన్ ఇంత ఘోరంగా ఓడిపోయేవారు కాదన్నది అందరూ అంగీకరించే విషయం. తాను పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు పదేళ్లుగా సరైన ప్రాతినిథ్యం లేని జనసేనను సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేయగలిగారు పవన్ . కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంలోనూ పవన్ కీలకంగా మారారు.
అయితే ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత ఉండవల్లి మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ పతనమైపోయింది అనుకుంటే అది టీడీపీ పొరపాటవుతుందని, ఒకవేళ తమ పని అపోయిందని వైసీపీ నేతలు అనుకున్నా అది వారి అపోహే అవుతుందని చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఓటమిపై సమీక్ష చేసుకుని తిరిగి పార్టీని నిలబెట్టాలన్నారు. ఓటమికి గల కారణాలు విశ్లేషించుకోవాలన్నారు. అసలు వైసీపీ ఎక్కడా లేకుండా పోయిందని, ఈ ఐదేళ్లలో అయినా పార్టీ నిర్మాణం జరగాలని, అధికార ప్రతినిధులను నియమించుకోవాలని, వారికి ఎలా మాట్లాడాలో నేర్పించాలని చెప్పారు ఉండవల్లి. టీడీపీ దాడులపై వైసీపీ న్యాయపోరాటం చేయాలని సూచించారు. వైసీపీ ఓటమికి ప్రధాన కారణం పవన్ కల్యాణ్ అని చెప్పారు ఉండవల్లి. బీజేపీతో పొత్తులో ఉంటూనే.. చంద్రబాబుని జైలులో కలసి వచ్చిన పవన్ కల్యాణ్ మద్దతిస్తున్నట్టు సొంతగా ప్రకటించారని, బీజేపీ లేకపోయినా టీడీపీతో కలసి వెళ్లాలనుకున్నారని, కేవలం వైసీపీ ఓటమికోసమే ఆయన పనిచేశారని అన్నారు. కమ్మ-కాపు కలసి పనిచేయడం ఈ ఎన్నికల్లో కూటమికి లాభంగా మారిందన్నారు ఉండవల్లి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…