RK Roja : రూ.100 కోట్ల అవినీతి చేసిన రోజా..? అరెస్టు త‌ప్ప‌దా..?

RK Roja : ఏపీలో రాజ‌కీయం మరింత రంజుగా మారుతుంది.వైసీపీ ప్రభుత్వంలో క్రీడల శాఖ మాజీ మంత్రిగా పనిచేసిన రోజా ‘ఆడుదాం ఆంధ్రా’, ‘సీఎం కప్‌’ల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారంటూ సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్‌ తెలిపారు. ఇందులో శాప్‌ మాజీ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరు కూడా చేర్చినట్లు చెప్పారు. భూ కబ్జాలు, ఇసుక అక్రమ తవ్వకాలు, మైనింగ్, మద్యం, రేషన్ బియ్యం, డ్రగ్స్ రవాణా ఇలా అన్ని రంగాల్లో వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు సంపాదించారని వారు విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని , అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత సైతం ఇదే రకమైన హెచ్చరికలు చేశారు. మాచర్లలో టీడీపీ కార్యకర్త చంద్రయ్య హత్య కేసును రీఓపెన్ చేయిస్తామని తెలిపారు. అలాగే టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులపై సమీక్ష చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు.జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజా.. తర్వాత మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణలో మంత్రి పదవిని కొట్టేశారు. క్రీడా, పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా రోజా ఓ వెలుగు వెలిగారు. వేదికలపై డ్యాన్సులు, పిల్లలతో కలిసి ఆటలు ఆడుతూ నిత్యం వార్తల్లో నిలిచేవారు.ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ క్రీడా ఉత్సవాలపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయమై ఆత్యా పాత్యా సంఘం సీఈఓ ఆర్డీ ప్రసాద్‌ సీఐడీకి ఫిర్యాదు చేశారు. విజయవాడలో సీఐడీ అధికారులను కలిసి ఫిర్యాదు పత్రం అందించారు.

RK Roja reportedly involved in rs 100 crore scam
RK Roja

ఫిర్యాదు అనంతరం ఆర్డీ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో రూ.100 కోట్ల అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నాటి క్రీడల శాఖ మంత్రి, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేక అకతవకలకు పాల్పడ్డారని చెప్పారు. ఈ అక్రమాలపై విచారణ చేయాలని సీఐడీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ హయాంలో శాప్‌ ఎండీలు, ఆ శాఖ ఉన్నత అధికారులు, డీఎస్‌డీఓలపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. క్రీడా శాఖకు సంబంధించి అన్ని ఫైళ్లను పరిశీలించాలని కోరారు. క్రీడా శాఖ మంత్రిగా రోజా ఉన్నప్పుడు.. క్రీడా పరికరాల కొనుగోలులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఆడుదాం ఆంధ్ర పోటీల్లో నాసిరకపు క్రీడా కిట్లను ఎక్కువ ధరలకు కొనుగోలు చేశారంటూ ఆరోపిస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago