Tapsee : చెన్నై చంద్రం తాప్సీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో అదరగొట్టిన ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ కూడా అదరగొట్టింది. మంచి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆమెకి మంచి క్రేజ్ దక్కడంతో స్టార్ స్టేటస్‌కి ఎదిగింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ భామ తన క్యూట్ ఫొటోస్‌తో రచ్చ చేస్తుంటుంది.తాజాగా ల్లా ఎగిరే కురులను అలా భుజాల వరకు వదిలేసి ఫ్లోరల్స్ మ్యాక్సీలో అబ్బాయిల టెంపరేచర్ పెంచేస్తోంది. డేరింగ్ అండ్ ఎక్స్ పెరిమెంటల్ ఫ్యాషన్ సెన్స్ కు పేరుగాంచిన తాప్సీ ఎప్పుడూ తన ఫోటోలతో ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తుంది. కొద్ది రోజుల క్రితం పసుపు రంగు చీరలో మెరిసిన ఆమె ఇప్పుడు నలుపు రంగు దుస్తుల్లో మరోసారి తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని ప్రదర్శించింది.
హాల్టర్ నెక్ లైన్, బ్లాక్ బ్రాలెట్ టాప్, మల్టీ కలర్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ తో ఉన్న మ్యాక్సీలో ఎంతో గ్లామరస్ గా ఉంది తాప్సీ లుక్. ఇది చూసి ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతున్నారు. సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ నమితా అలెగ్జాండర్ సహకారంతో తాప్సీ తన దుస్తులను, యాక్సెసరీలను ప్రత్యేకంగా చేయించుకుంది. భారీ బ్లాక్ స్టడ్ చెవిపోగులు, వేలిని అలంకరించే స్టేట్మెంట్ రింగ్ తో స్టైలిష్ ఐకాన్ లా ఉంది. మేకప్ ఆర్టిస్ట్ ఎవానియా పన్నూ సాయంతో తాప్సీ ఐషాడో, మస్కారా, హైలైటర్, న్యూడ్ లిప్ స్టిక్ షేడ్ లో మెరిసింది. హెయిర్ స్టైలిస్ట్ సీమా మానే సహాయంతో తాప్సీ తన అందమైన కర్లీ హెయిర్స్ మరింత అందంగా స్టైలింగ్ చేయించుకుంది. జుట్టును భుజాల కింద వరకు అందంగా అలా వదిలేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోయిన్ తాప్సీ పన్నూ. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఈ భామ.. అతి తక్కువ టైంలోనే స్టార్ డమ్ అందుకుంది. రవితేజ, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. కొన్నాళ్లుగా హిందీలో సినిమాలు చేస్తూ అక్కడే ఉండిపోయింది. చివరగా షారుఖ్ ఖాన్ నటించిన డుంకీ చిత్రంలో కనిపించిన తాప్సీ.. ఇటీవలే తన ప్రియుడు మథియాస్ బో ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత తాప్సీ మూవీ, అవార్డ్స్ ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…