Niharika Konidela : మెగా ఫ్యామిలీలో ముదిరిన విభేదాలు.. బ‌న్నీని తేజ్ అన్‌ఫాలో చేయ‌డంపై నిహారిక రియాక్ష‌న్..

Niharika Konidela : మెగా ఫ్యామిలీలో ఏపీ ఎన్నిక‌ల త‌ర్వాత విభేదాలు మ‌రింత ముదిరాయి.మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ గతంలో మాదిరిగా కలివిడిగా ఉండటం లేదని.. దీనికి బన్నీ వైఖరే కారణమని సోషల్ మీడియాలో ఏనాటి నుంచో డిస్కషన్ నడుస్తోంది. ముఖ్యంగా ‘చెప్పను బ్రదర్ ‘ ఇష్యూ నుంచి కుటుంబంలో చీలిక వచ్చిందని ఫిలింనగర్ సర్కిల్స్‌లో చ‌ర్చ న‌డుస్తుంది. ఈ క్ర‌మంలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరనే సంకేతాలను మరోసారి బలంగా పంపింది. ఎన్నికల ప్రచార గడువు కొద్దిగంటల్లో ముగుస్తుందనగా తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్ధతు పలికేందుకు బన్నీ తన భార్యతో కలిసి నంద్యాలలో దిగారు. శిల్పా రవిని గెలిపించాలని తన అభిమానులను కోరారు. ఇది తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

సొంత మేనమామ పవన్ కళ్యాణ్ ‌పిఠాపురంలో కష్టపడుతుంటే ఓ చిన్న ట్వీట్‌తో సరిపెట్టి.. ఫ్రెండ్ వద్దకు స్వయంగా వెళ్లడాన్ని అది కూడా పవన్ కళ్యాణ్ బద్ధ వ్యతిరేకి వైఎస్ జగన్‌ పార్టీకి చెందిన వ్యక్తి ఇంటికా అంటూ మెగా, జనసేన అభిమానులు తప్పుబడుతున్నారు. అయితే ఫలితాల రోజున అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన శిల్పా రవి ఓటమి పాలయ్యారు. ఈ రిజల్ట్‌తో అభిమానులు మరోసారి బన్నీని ట్రోల్ చేస్తున్నారు. ఇటీవ‌ల‌ మెగా మేనల్లుడు సాయిథరం తేజ్ .. అల్లు అర్జున్‌తో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో ఆన్‌ ఫాలో చేసినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో వారిని ఆన్‌ఫాలో చేసినట్లుగా తెలుస్తోంది. అల్లు ఫ్యామిలీ నుంచి కేవలం అల్లు శిరీష్‌ని మాత్రమే సాయి ఫాలో అవుతున్నారు.

Niharika Konidela reaction on sai dharam tej unfollowing allu arjun
Niharika Konidela

ఈ విష‌యంపై తాజాగా నిహ‌రిక కొణిదెలా స్పందించింది. నిహ‌రిక కొణిదెలా స‌మ‌ర్ప‌ణ‌లో వ‌స్తున్న తాజా చిత్రం క‌మిటీ కుర్రాళ్లు. ఈ సినిమా టీజ‌ర్ వేడుక‌లో పాల్గోన్న నిహ‌రికను ఒక రిపోర్ట‌ర్ సాయితేజ్ – అల్లు అర్జున్ వివాదం విష‌యం అడుగగా ఆమె స్పందించింది. నిహ‌రిక మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ను సాయి ధ‌ర‌మ్ తేజ్ అన్​ఫాలో చేసిన విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని. ఎందుకు అన్‌ఫాలో చేశాడో.. ఎవరి కారణాలు వారికి ఉంటాయని చెప్పుకొచ్చారు. దీంతో నిహారిక చాలా తెలివిగా స్పందించింద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago