Tollywood : సినిమా ఇండ‌స్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారెవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Tollywood : సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్రేమ పెళ్లిళ్లు స‌హ‌జ‌మే. ఏదో ఒక స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డ‌డం, ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవడం వంటివి చేస్తుంటారు. దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో కొందరు హీరోలు ఒకటికి మించిన పెళ్లిళ్లు చేసుకున్నారు, వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ నుండి చూస్తే.. సీనియర్ ఎన్టీఆర్ 20 ఏళ్ల వయస్సులోనే తన మేనమామ కుమార్తె బసవతారకంను వివాహం చేసుకున్నారు. బసవతారకం 1985లో గైనిక్ క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఆ త‌ర్వాత లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. ఇక రెబల్‌స్టార్ కృష్ణంరాజుకు కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన మొదటి భార్య సీతా దేవి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో శ్యామలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు.

ఇక విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదట వాణీగణపతిని వివాహం చేసుకోగా.. తరువాత సారికను పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు.అనంత‌రం గౌతమితో సహజీవనం చేశాడు. ఇక టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున మొదటగా లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు రావ‌డంతో ఆయన హీరోయిన్ అమలను పెళ్లి చేసుకున్నాడు. ఇక శరత్ బాబు మొదట నటి రమాప్రభను వివాహం చేసుకున్నారు. ఏవో విబేధాలు రావ‌డంతో వారు విడిపోయారు. అనంత‌రం స్నేహలత ను వివాహం చేసుకున్నారు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చి మరో జర్నలిస్టు వివాహం చేసుకున్నారు శ‌ర‌త్ బాబు.

Tollywood industry two times married actors
Tollywood

ప్రకాష్‌రాజ్ ముందుగా లలితకుమారిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ విడిపోయాక బాలీవుడ్ డ్యాన్సర్ పోనీవర్మను పెళ్లి చేసుకున్నాడు. ;అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన రష్యా అమ్మాయి అన్నా లెజ్నోవానుతో జీవనం సాగిస్తున్నారు. ఇక రెండు పెళ్లిళ్ల విషయంలో తండ్రి ఎన్టీఆర్‌నే అనుసరించాడు హ‌రికృష్ణ‌. 1973లో లక్ష్మీని పెళ్లి చేసుకున్నారు.. ఈ దంపతులకు జానకీరామ్, కల్యాణ్ రామ్, సుహసినిజన్మించారు. అనంతర పరిణామాలతో హరికృష్ణ… షాలిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరి సంతానమే జూనియర్ ఎన్టీఆర్.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago