Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఈ పేరుకి పరిచయాలు అక్కర్లేదు. చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందాడు. అయితే ఎంత ఎదిగిన పవన్ కళ్యాణ్ మాత్రం తనకు సపోర్ట్ ఇచ్చిన వారిని అస్సలు మరువడు. చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్‌కి దేవుడితో సమానం. అప్పట్లో చిరంజీవి విషయంలో పవన్ కళ్యాణ్ రౌడీలతో పెద్ద గొడవ పడ్డాడట. పవన్ కల్యాణ్ కు తమిళనాడుకు చెందిన ఓ రౌడీతో అప్పట్లో గొడవ జరిగింది. చిరు.. కోడి రామకృష్ణ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో తమిళనాడులోని చెన్నై పరిసర ప్రాంతంలో నివాసం ఉండేవాడు.
కోడిరామకృష్ణ కూడా చిరుతో చెన్నై లోని కోడంబాకం పరిసరప్రాంతంలో ఓ సినిమా షూటింగ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో అక్కడ కొందరు లోకల్ గూండాలు వచ్చి తిట్టడం, కామెంట్లు చేయడం చేశారట. ఈ విషయం చిరు కార్ డ్రైవర్ వెళ్లి పవన్ కల్యాణ్ కు చెప్పడంతో, అప్పుడు వెంటనే పవన్ కల్యాణ్ షూటింగ్ స్పాట్ కు వెళ్లి ఆ గూండాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. ఆ సమయంలో కుప్పుస్వామి అనే రౌడీకి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్నచిరు వెంటనే హాస్పిటల్ కు వెళ్లి కుప్పుస్వామిని పరామర్శించాడు. అంతే కాకుండా మరోసారి ఇలాంటి గొడవలకు వెళ్లొద్దంటూ పవన్ కు వార్నింగ్ ఇచ్చాడట.
ఇక చిరంజీవి ఇప్పటికీ తన తమ్ముడికి అండగానే ఉంటాడు. ఇటీవల పవన్ కళ్యాణ్, జన సేన గురించి స్పందించాల్సిన సమయం వచ్చింది. గతంలో ఓ సారి చిరు మాట్లాడుతూ.. ఇంట్లోనే ఓ పార్టీ ఉండగా.. వేరే పార్టీలకు ఎందుకు మద్దతిస్తాను.. నా తమ్ముడికే మద్దతిస్తాను అని చిరంజీవి అన్నాడట. ఈ విషయాన్ని ఓ రిపోర్టర్ ప్రెస్ మీట్‌లో ప్రస్థావించాడు. మీరు నాతో ఫోన్ ఇంటర్వ్యూలో అలా అన్నారు.. ఇప్పుడు కూడా అదే మాట మీదున్నారా? అని చిరంజీవిని ప్రశ్నించాడు. ఆ సమయంలోతన తమ్ముడి నిబద్దత గురించి తనకు తెలుసు అని, తన లాంటి నాయకులు రావాలని కోరుకున్నాడు. తాను ఒక పక్క.. తన తమ్ముడు ఒక పక్క ఉండటం ఎందుకు.. తాను పక్కకి తప్పుకుంటే.. తన తమ్ముడు ఎమర్జ్ అవుతాడనిపిస్తుందంటూ చిరంజీవి అన్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…