Jr NTR : సినిమాకి మొదటి రోజు మొదటి ఆట వచ్చే రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టాక్ ని బట్టే సినిమా హిట్టా ఫట్టా అనేది డిసైడ్ చేస్తుంటారు. ప్రేక్షకులు కూడా ఫస్ట్ షో రోజు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలుసుకొని థియేటర్స్ కి వెళుతుంటారు. అయితే ఒకసారి ఒక సినిమాకి తొలుత నెగెటివ్ టాక్ వచ్చిన తరువాత అది క్రమక్రమంగా పాజిటివ్‌గా మారి సూపర్ హిట్ అవుతుంది. ఆ క్రమంలో హిట్ అయిన చిత్రం నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం కాగా, ఇందులో జూనియర్ ఎన్ టి ర్, రకుల్ ప్రితి సింగ్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సితార, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిశోర్, రాజివ్ కనకాల, తాగుబోతు రమేష్, మధుబాల తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు.
ఈ సినిమాకి దర్శకత్వం సుకుమార్ నిర్వహించారు మరియు నిర్మాత బి వి ఎన్ ఎస్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చురు. ఇందులో ఎన్టీఆర్ లుక్ కు అభిమానులు అంతా ఫిదా అయ్యారు.ఎన్టీఆర్ లుక్ సూపర్ అంటూ ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేశారు. తీరా సినిమా విడుదలైన తర్వాత మాత్రం ప్రేక్షకులు ముఖ్యంగా అభిమానులు కూడా పెదవి విరిచారు. సుకుమార్ పెద్ద లెక్కల మాస్టర్ కాబట్టి ఆయన కాలుక్యులేషన్స్ వెంటనే రిసీవ్ చేసుకోలేకపోయారు.
సుకుమార్ స్థాయిలో ఆలోచించడం అప్పటి ప్రేక్షకుల వల్ల కాలేదు.అందుకే నాన్న కు ప్రేమతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేదు అంటారు విశ్లేషకులు. అయితే మొదటి రోజు నెగెటివ్ టాక్ వచ్చిన ఈ చిత్రం తర్వాత తర్వాత పుంజుకుంది. 54 కోట్ల షేర్ రాబట్టి అద్భుతమైన విజయం సాధించింది. సుకుమార్ స్థాయి ఏంటి అనేది ఆ సినిమా నిరూపించింది.సుకుమార్ ఒక మంచి దర్శకుడు అనడంలో ఎలాంటి డౌట్ లేదు అని ఆ సినిమా మరోసారి నిరూపించింది. ఈ సినిమా ఇప్పట్లో వచ్చి ఉంటే మరింత సూపర్ హిట్ అయి ఉండేదని అంటున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…