Ramanaidu : చెన్నైలో ఉన్న సినీ పరిశ్రమ హైదరాబాద్‌కి రావడం వెనక అలనాటి ప్రముఖుల త్యాగం ఎంతో ఉంది. హైదరాబాద్‌కి పరిశ్రమ వచ్చాక కృష్ణ, రామానాయుడు, ఏఎన్ ఆర్ వంటి వారు ఎన్నో వ్యయప్రయాసలు చేకూర్చి స్టూడియో నిర్మించారు. అయితే దగ్గుబాటి రామానాయుడు స్టూడియో నిర్మాణం వెనక చిన్నపాటి యుద్ధమే చేశారు. మద్రాసు నుండి చిత్రపరిశ్రమ షిఫ్ట్ అయితన సమయంలో సీఎంగా జలగం వెంకటరావు ఉన్నారు. ఆయన అక్కనేని కి బంజారా హిల్స్ లో స్థలం కేటాయించారు. ఇక నిర్మాత డి రామానాయుడిని కూడా స్థలం కావాలా అని అడిగారట. కానీ రామానాయుడు వద్దన్నారట. దానికి కారణం ఆయన విజయప్రొడక్షన్స్ లో సినిమాలు చేస్తూ వారి స్టూడియోనే తన స్టూడియో అనుకున్నారట.
నిర్మాత నాగిరెడ్డి ఓ సమయంలో కొండలో స్టూడియో కడితే బాగుంటుందని సలహా ఇచ్చారట.దాంతో రామానాయుడికి అక్కడ స్టూడియో కట్టాలనే ఆలోచన మొదలయ్యింది. ఆ తరవాత భవనం వెంకట్రావ్ సీఎంగా ఉన్పప్పుడు రామానాయుడికి స్టూడియో కోసం స్థలాన్ని కేటాయించారు. అయితే ఈ ప్లేస్ చూసిన ఎన్టీరామారావు ఈ రాళ్లల్లో ఏం స్టూడియో కడతావు అంటూ ప్రశ్నించారట. ఇక్కడి నుండిచూస్తే వ్యూ బాగుంటుందని రామానాయుడు చెప్పగా, దానికి ఎన్టీఆర్ వ్యాపారం చేసుకుంటావా.? వ్యూ చూస్తూ కూర్చుంటావా. ఇక్కడ ఎవరు సినిమాలు తీస్తారని సరదాగా అన్నారట.
కాని ఆయన దీక్షగా పనులు మొదలు పెట్టారు. రాళ్లను బద్దలు కొట్టడానికి చాలా సమయం పట్టింది ఆ సమయంలో నిరాశలోకి వెళ్లిపోయారు రామానాయుడు. అదే సమయంలో సురేష్ బాబు ఎంట్రీ ఇవ్వడం వెంకటేష్ కూడా సినిమాలు చేస్తూ డబ్బులు సంపాదించడంతో వారి ఆదాయం అంతా స్టూడియో మీదనే ఖర్చు చేశారు. కానీ చివరికి అన్ని సౌకర్యలతో స్టూడియోను నిర్మించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. రామానాయుడు స్టూడియోస్.. హైదరాబాద్‌లో ఈ పేరుతో రెండు ఉన్నాయి, విశాఖపట్నంలో ఒకటి ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌లో ఉన్న రెండింటిలో ఒకదాంట్లోనే సీరియస్‌గా సినిమా వర్క్లు జరుగుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…