యంగ్ హీరో నిఖిల్ చాలా రోజుల తరువాత కార్తికేయ 2తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. కార్తికేయకు సీక్వెల్‌గా వచ్చినప్పటికీ మొదటి పార్ట్‌కు, దీనికి సంబంధం లేదు. సెకండ్ పార్ట్‌లో కొత్త కథను చూపించారు. కథలో కొత్తదనం ఉంది. కనుక సినిమా హిట్ అయింది. ఇక హిందీ మార్కెట్‌లోనూ ఈ మూవీ భారీ హిట్‌గా నిలిచింది. దీంతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే కార్తికేయ 2 విడుదలైన ఇన్ని రోజుల తరువాత ఈ మూవీపై ఒక వివాదం నెలకొంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
కార్తికేయ 2 మూవీ వాస్తవానికి జూలై 22నే రిలీజ్ కావల్సి ఉంది. కానీ అదే తేదీ రోజు నాగచైతన్య నటించిన థాంక్ యూ మూవీని రిలీజ్ చేశారు. అందువల్ల కార్తికేయ 2ను వాయిదా వేయాల్సి వచ్చింది. తరువాత నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం కోసం కార్తికేయ 2ను ఇంకో రోజుకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే కార్తికేయ 2ను నాగార్జున, నితిన్ అడ్డుకున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కార్తికేయ 2 హిట్ అవుతుందని నాగార్జునకు, నితిన్‌కు ముందే తెలుసని.. కనుకనే థియేటర్లను చేతిలో పెట్టుకున్న నిర్మాత దిల్ రాజుతో కలిసి కుట్ర పన్నారని.. అందుకనే కార్తికేయ 2ను అడ్డుకున్నారని అంటున్నారు. ఇక ఈ మూవీలో హీరో నిఖిల్‌కు తల్లిగా నటించిన తులసి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్తికేయ 2 సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ఇక ఇప్పుడు అడ్డుకోండి, మా సినిమాను ఎవరు అడ్డుకుంటారో చూస్తాం.. అంటూ కామెంట్స్ చేసింది. దీంతో కార్తికేయ 2ను నిజంగానే నాగార్జున, నితిన్‌లు అడ్డుకుని ఉంటారని అంటున్నారు. అయితే దీనిపై వారు పెదవి విప్పలేదు. మరి ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…