విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ ఫ్లాప్ అవడంతో అందరూ ఆ చిత్ర యూనిట్‌ను తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో తమ మధ్య ఉన్న వైరాన్ని గుర్తు చేసుకుని యాంకర్ అనసూయ కూడా ఘాటుగా విమర్శలు చేసింది. దీన్ని తట్టుకోలేని విజయ్ ఫ్యాన్స్ ఆమెను ఆంటీ అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే తనను విమర్శిస్తున్న వారికి అనసూయ చాలా స్ట్రాంగ్‌గా రిప్లై ఇస్తోంది కూడా. అయితే తాజాగా అనసూయకు కొందరు నెటిజన్లు వింత ప్రశ్నలు వేశారు.
గత మూడు రోజులుగా వరుసగా ట్వీట్లు చేస్తూ ఆమె తన సహనాన్ని, తన బాధను, తన ఆవేదనను వ్యక్తం చేస్తోంది. అయితే నెటిజన్లు ఆమెను ఆంటీ అంటూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నా ట్వీట్లు చేయడం మాత్రం ఆపడం లేదు. అనసూయను ఓ నెటిజన్ ప్రశ్నిస్తూ.. ఆంటీ అని పిలిస్తే రెస్పెక్ట్ లేనట్టా అని అంటే.. ఇలా వితండ వాదాలు చేస్తే మీకొచ్చే లాభం ఏమిటి ? నా పిల్లల ఫ్రెండ్స్, మా చుట్టాల్లో పిల్లలకు నేను ఆంటీనే. కానీ ఇక్కడ మీరతంతా చూసేది నా వయస్సును. మీ ఉద్దేశాలు వేరు. అది తప్పు. అది అగౌరవ పరచడం అని అంటున్నాను అని అనసూయ ఘాటుగా స్పందించింది.
ఇదే క్రమంలో మరో నెటిజన్ అనసూయని అసభ్యంగా ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు. ఒక రోజుకి నీ రేటు ఎంత.. అదే ఒక షోకి ఎంత తీసుకుంటావు అంటూ వెటకారంగా ప్రశ్నించాడు. దీంతో అతడికి అనసూయ ఎమోషనల్ గా దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. చాలా లోకువ కదండీ మీకు నేనంటే.. అదే మీ చెల్లినో, భార్యనో ఇలా అడుగుతారా.. మీ రేటు ఎంత.. అదే ఆఫీస్ లో వాళ్ళని అడిగితే ఏం చెబుతారు అని ఫైర్ అయింది. దీంతో ఆ నెటిజన్ ఆ ట్వీట్ ని వెంటనే డిలీట్ చేశాడు. ఇలా అనసూయ నెటిజన్లతో గొడవకు దిగడంపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. దీనికి ముగింపు లేదా అనసూయ గారు అంటే.. మీ చేతుల్లోనే ఉన్నది. లేదా చివరికు చట్ట ప్రకారం శిక్ష పడుతుంది అని అనసూయ ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…