రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన మూవీ.. లైగర్. ఆగస్టు 25న రిలీజ్ అయిన ఈ మూవీకి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ రెండో రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోయింది. వసూళ్లు దారుణంగా పడిపోయాయి. అయితే మూవీని అడ్డ దిడ్డంగా కథ ఏమీ లేకుండా తీశాడంటూ దర్శకుడు పూరీపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక ఇలాంటి కథను ఎంచుకుని సినిమా తీసినందుకు గాను విజయ్‌ని కూడా నెటిజన్లు వదలడం లేదు. ఇంతోటి సినిమాకేనా ఇండియాను షేక్ చేద్దాం.. అని పబ్లిసిటీ చేశారు.. అంటూ ఎడాపెడా ఏకిపారేస్తున్నారు.
అయితే తమిళనాడుకు చెందిన శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ హీరోగా వచ్చిన ది లెజెండ్ మూవీనే లైగర్ కన్నా బాగుందని అంటున్నారు. అందుకు కారణం ఐఎండీబీ రేటింగ్స్ అని చెప్పవచ్చు. ది లెజెండ్ మూవీకి అందులో 10కి 5 రేటింగ్స్ రాగా.. లైగర్ కు మాత్రం 1 రేటింగ్ వచ్చింది. అంటే ది లెజెండ్ కన్నా లైగర్ మూవీ ఇంకా పరమ చెత్తగా ఉందని అర్థం చేసుకోవచ్చు. దీంతో ఈ విషయాన్ని అదునుగా చేసుకుని నెటిజన్లు విజయ్‌ని ట్రోల్ చేస్తున్నారు. శరవణన్ ఫొటో, విజయ్ ఫొటోను మార్ఫింగ్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందు రూ.90 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ సగం కూడా వసూలు అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. అలాగే ఈ మూవీతో చార్మి, పూరీ జగన్నాథ్ ఆస్తులను, సర్వాన్ని కోల్పోయారని అంటున్నారు. దీని వల్ల పూరీ నెక్ట్స్ సినిమా జనగణమణను విజయ్ చేయకపోవచ్చని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే విషయం తేలనుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…