Tholiprema Vasuki : నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల లో రూపొందిన ‘అన్నీ మంచి శకునములే’. ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది నటి వాసుకి . తొలిప్రేమ తర్వాత దాదాపు 23 ఏళ్ళు తర్వాత మళ్లి కెమెరా ముందుకువచ్చారు. అయితే తొలి ప్రేమ తర్వాత నాకు చాలా అవకాశాలు కూడా వచ్చాయి. కానీ చేయడం నాకు కుదరలేదు. ఎందుకంటే నేను మల్టీ టాస్కర్ కాదు. అన్ని పనులు ఒకేసారి చేయలేను అని చెప్పుకొచ్చింది.
ముందు పిల్లలు, వాళ్ళ చదువులు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు యూకేలో చదువుతున్నారు. పాప మెడిసిన్ ఫోర్త్ ఇయర్, బాబు సెకండ్ ఇయర్ ఆర్కిటెక్చెర్. ఆనంద్ గారు ఆయన పనిలో బిజీగా వుంటారు. ఇప్పుడు ఏదైనా చేయడానికి నాకు సమయం కుదిరింది. ఇలాంటి సమయంలో నందిని రెడ్డి గారు ఈ కథతో వచ్చారు. నాకు నచ్చింది. సినిమాతో పాటు చదువుపై కూడా దృష్టి పెట్టాను. సైకాలజీలో పీహెచ్డీ చేస్తున్నాను. కథ కథనాలు నచ్చడంతో ఒప్పుకున్నాను అని వాసుకి అన్నారు.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, పవన్ కళ్యాణ్ స్నేహితుడు ఆనంద్ సాయిని వివాహం చేసుకుంది వాసుకి.
యాక్టింగ్ కెరీర్ ని ఎందుకు సీరియస్ తీసుకోలేదు అన్నప్రశ్నకి వాసుకి స్పందిస్తూ.. యాక్టింగ్ కాదు..నేను దేన్ని సీరియస్ గా తీసుకొను. ఇదే మన దారి ఇదే చేయాలని అనుకోను. అది నా తత్త్వం. కొంచెం ఫిలసాఫికల్ గా వెళ్ళిపోతాను. మొదటి నుండి నా ఆలోచన అలానే ఉండేది అని చెప్పుకొచ్చింది. ‘ఒక విరామం తర్వాత మళ్లీ సినిమా చేస్తున్నామంటే మన కంఫర్ట్ జోన్ ముఖ్యం. ‘తొలిప్రేమ’ చేసినప్పుడు నాకు 18 ఏళ్లు. అప్పుడు డైలాగ్ రాకపోయినా, తెలుగు రాకపోయినా, కొత్త స్థలమైనా, ఏదైనా ఒక ధైర్యంతో ముందుకు వెళ్లిపోతాం. ఈ ఏజ్‌లో రీఎంట్రీ చేయాలంటే మాత్రం ఒక సేఫ్, కంఫర్ట్ జోన్ చూస్తాం. ఈ చిత్ర కథ విన్న వెంటనే సేఫ్, కంఫర్ట్ జోన్‌గా ఫీలయ్యాను. ఓకే చెప్పాను అని వాసుకి వివరించారు. ఇక యాదాద్రి ఆలయాన్ని పునర్‌నిర్మాణంలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ప్రధాన భూమిక పోషించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…