Short Film : ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న షార్ట్ ఫిలిం.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

Short Film : ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయం ఎంత రంజుగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటూ రాజ‌కీయం మ‌రింత రంజుగా మారుస్తున్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలెంత నష్టపోయారో చూపుతూ తెలుగుదేశం రూపొందించిన ‘దివాకరం’ షార్డ్‌ ఫిల్మ్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. “ది క్యాషియర్‌” అనే ట్యాగ్‌తో విడుదలైన ఈ చిత్రానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. అయిదేళ్ల జగన్‌ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో పన్నులు, ధరల పెంపు ద్వారా ఒక్కో కుటుంబంపై ఎంత భారం పడిందో వివరిస్తూ తెలుగుదేశం పార్టీ రూపొందించిన ‘దివాకరం’ షార్ట్‌ ఫిల్మ్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

‘ది క్యాషియర్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో 8 నిమిషాల నిడివిగల ఈ వీడియో వివిధ వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అజయ్‌ అమృత్‌, అనిల్‌ దర్శకత్వంలో హేమంత్‌ ప్రధాన పాత్రధారిగా నటించగా హాస్యనటుడు నారాయణస్వామి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. శనివారం విడుదలైన వీడియో సాయంత్రానికే 10 లక్షల వీక్షణలు దాటిందని వారు వివరించారు. బ్యాంకు క్యాషియర్‌గా పని చేసే దివాకరం అందరికీ ఉచితంగా డబ్బు ఇస్తున్నారంటూ వెంకీ బృందం డప్పులతో ప్రచారం చేస్తుంది. దీంతో గ్రామస్థులంతా బ్యాంకు దగ్గరకు పరుగు తీయడంతో చిత్రం ప్రారంభం అవుతుంది. తాను ఎవరికీ ఉచితంగా డబ్బు ఇవ్వలేదని, వెంకీ అనే వ్యక్తి తన డబ్బు తానే డ్రా చేసుకుని తీసుకెళ్లాడని దివాకరం చెబుతాడు. గ్రామస్థులంతా వెంకీ దగ్గరకెళ్లి ‘నీ డబ్బు నీకిచ్చిన దివాకరానికి ఎందుకు పాలాభిషేకం చేస్తున్నావు’ అని ప్రశ్నిస్తారు. దీంతో అతను ‘అమ్మఒడి రైతు భరోసా, ఆటోడ్రైవర్ల ఖాతాల్లో డబ్బులు వేసినప్పుడు మీరు జగన్‌కు పాలాభిషేకాలు చేశారు కదా? ఆ డబ్బు ఏమైనా సాక్షి మీడియా , భారతీ సిమెంట్‌, లోటస్‌పాండ్‌ ప్యాలెస్‌ అమ్మేసి ఇచ్చిన డబ్బులా? మరెందుకు పాలాభిషేకం చేశారు?’ అంటూ నిగ్గదీయడంతో వారికి నోటమాట రాదు.

this Short Film creating sensation in ap viral in social mediathis Short Film creating sensation in ap viral in social media
Short Film

అభివృద్ధి చేయడం రాదు, రాజధాని కట్టలేరు, పోలవరం పూర్తి చేయలేరు. ప్రత్యేక హోదా తీసుకురాలేరు. అలాంటి వారికి ఓటెలా వేస్తార్రా’ అని కథానాయకుడి పాత్రధారి వేసే ప్రశ్నలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ‘ఈ మాత్రం బటన్‌ నొక్కడానికి బామ్మ చాలదా? సీఎం అనేవారు ఒకరు కావాలా?’ అంటూ ముక్తాయించారు. ఇది ఏపీ రాజ‌కీయాల‌లో సంచ‌ల‌నం రేపింది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

6 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

6 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

6 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

6 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

6 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 months ago