Shivam Dube : శివ‌మ్ దూబే చీటింగ్ చేశాడా.. అంపైర్ జేబులు చెక్ చేయ‌డానికి కార‌ణం ఏంటి..?

Shivam Dube : ప్ర‌స్తుతం ఐపీఎల్ ఎంత ర‌స‌వ‌త్త‌రంగా మారుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఏ టీం గెలుస్తుందో చెప్ప‌డం క‌ష్టంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఓ అనుహ్య సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఒక ఆ సీన్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మ్యాచ్ మధ్యలో ఫీల్డ్ అంపైర్ చెన్నై స్టార్ ప్లేయర్ శివం దుబే జేబులు చెక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్ మ‌ధ్యలో దూబే ప్యాంట్ జేబుల్లో ఏదో ఉందన్నట్టు అనుమానం రావడంతో.. అంపైర్ అనిల్ ఇన్నింగ్స్ మధ్యలో అతడి జేబుల్ని తనిఖీ చేయడం జరిగింది. అప్పుడప్పుడు ఆటగాళ్లు బంతి ఆకారాన్ని లేదా స్థితిని మార్చేందుకు.. తమతో పాటు కొన్ని వస్తువులు తీసుకొస్తుంటారు.

బాల్ ట్యాంపరింగ్ వ్యవహారాల గురించి అందరూ వినే ఉంటారు. బహుశా.. దూబే కూడా అదే పని చేసేందుకు ఏదైనా వస్తువు వెంట తెచ్చుకున్నాడేమోనన్న ఉద్దేశంతో.. అనిల్ ఇలా జేబులను పరిశీలించినట్లు తెలుస్తోంది. లేకపోతే.. మరో ఇతర కారణం ఏమైనా ఉందా? అనేది మాత్రం క్లారిటీ లేదు. ఏదేమైనా.. ఈ టాపిక్ మాత్రం ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్‌చల్ అవుతోంది. ఆన్ ఫీల్డ్ అంపైర్ అకస్మాత్తుగా చెక్ చేశాడు. దుబే బ్యాటింగ్ కు వచ్చిన తర్వాత ఇన్నింగ్స్ మధ్యలో అంపైర్ అనీల్ చౌదరి అతడి దగ్గరికి వెళ్లి.. జేబులను చెక్ చేశాడు. దీంతో ఒక్కసారిగా గ్రౌండ్ లో ఏం జరుగుతుందో తెలియక ప్రేక్షకులు అయోమయానికి గురైయ్యారు.

Shivam Dube cheated in ipl match is it true why umpires checked his pockets
Shivam Dube

అంపైర్ అనుమతి లేకుండా ఆటగాళ్లు గ్రౌండ్ లోకి ఎలాంటి క్రీమ్స్ గానీ, ఇతర వస్తువులు గానీ తీసుకురాకూడదు. ఇక అంపైర్ తనిఖీలో దుబే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు తీసుకురాలేదని తెలుస్తోంది. నెటిజన్లు మాత్రం దుబే కర్చీఫ్ బయటకి వస్తే.. అంపైర్ పాకెట్ లోకి నెట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (57) అర్థశతకంతో చెలరేగడం.. రహానే (36), మోయిన్ అలి (30) మెరుగ్గా రాణించడం.. చివర్లో ధోనీ (28) మెరుపులు మెరిపించడంతో.. సీఎస్కే అంత స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేధనలో భాగంగా.. లక్నో జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే రెండు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి విజయఢంకా మోగించింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కేఎల్ రాహుల్ (82) మెరవడం, డీకాక్ (54) అర్థశతకంతో చేయూతనందించడంతో.. లక్నో సునాయాసంగా ఆ లక్ష్యాన్ని ఛేధించగలిగింది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago