Shivam Dube : ప్రస్తుతం ఐపీఎల్ ఎంత రసవత్తరంగా మారుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఏ టీం గెలుస్తుందో చెప్పడం కష్టంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఓ అనుహ్య సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఒక ఆ సీన్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మ్యాచ్ మధ్యలో ఫీల్డ్ అంపైర్ చెన్నై స్టార్ ప్లేయర్ శివం దుబే జేబులు చెక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్ మధ్యలో దూబే ప్యాంట్ జేబుల్లో ఏదో ఉందన్నట్టు అనుమానం రావడంతో.. అంపైర్ అనిల్ ఇన్నింగ్స్ మధ్యలో అతడి జేబుల్ని తనిఖీ చేయడం జరిగింది. అప్పుడప్పుడు ఆటగాళ్లు బంతి ఆకారాన్ని లేదా స్థితిని మార్చేందుకు.. తమతో పాటు కొన్ని వస్తువులు తీసుకొస్తుంటారు.
బాల్ ట్యాంపరింగ్ వ్యవహారాల గురించి అందరూ వినే ఉంటారు. బహుశా.. దూబే కూడా అదే పని చేసేందుకు ఏదైనా వస్తువు వెంట తెచ్చుకున్నాడేమోనన్న ఉద్దేశంతో.. అనిల్ ఇలా జేబులను పరిశీలించినట్లు తెలుస్తోంది. లేకపోతే.. మరో ఇతర కారణం ఏమైనా ఉందా? అనేది మాత్రం క్లారిటీ లేదు. ఏదేమైనా.. ఈ టాపిక్ మాత్రం ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్‌చల్ అవుతోంది. ఆన్ ఫీల్డ్ అంపైర్ అకస్మాత్తుగా చెక్ చేశాడు. దుబే బ్యాటింగ్ కు వచ్చిన తర్వాత ఇన్నింగ్స్ మధ్యలో అంపైర్ అనీల్ చౌదరి అతడి దగ్గరికి వెళ్లి.. జేబులను చెక్ చేశాడు. దీంతో ఒక్కసారిగా గ్రౌండ్ లో ఏం జరుగుతుందో తెలియక ప్రేక్షకులు అయోమయానికి గురైయ్యారు.
అంపైర్ అనుమతి లేకుండా ఆటగాళ్లు గ్రౌండ్ లోకి ఎలాంటి క్రీమ్స్ గానీ, ఇతర వస్తువులు గానీ తీసుకురాకూడదు. ఇక అంపైర్ తనిఖీలో దుబే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు తీసుకురాలేదని తెలుస్తోంది. నెటిజన్లు మాత్రం దుబే కర్చీఫ్ బయటకి వస్తే.. అంపైర్ పాకెట్ లోకి నెట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (57) అర్థశతకంతో చెలరేగడం.. రహానే (36), మోయిన్ అలి (30) మెరుగ్గా రాణించడం.. చివర్లో ధోనీ (28) మెరుపులు మెరిపించడంతో.. సీఎస్కే అంత స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేధనలో భాగంగా.. లక్నో జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే రెండు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి విజయఢంకా మోగించింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కేఎల్ రాహుల్ (82) మెరవడం, డీకాక్ (54) అర్థశతకంతో చేయూతనందించడంతో.. లక్నో సునాయాసంగా ఆ లక్ష్యాన్ని ఛేధించగలిగింది.