తెలంగాణ ఎన్నికలు రంజుగా మారనున్న విషయం తెలిసిందే.బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఆయన నివాసంలో జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం వికారాబాద్ పట్టణం ధన్నారం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలులు వీస్తున్నాయని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని వారు తెలిపారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద 104ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ తరపున మద్దతు తెలిపారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ సంస్థలు సర్వేలు నిలుస్తుండగా, తాజాగా లోక్ పోల్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కాంగ్రెస్‌దే గెలుపుగా చెబుతున్నారు.. మరోమారు తమదే అధికారమని చెబుతున్న బీఆర్‌ఎస్ కు లోక్ పోల్ సర్వే షాక్ ఇచ్చినట్టే అయింది.తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని అందరు భావిస్తున్న క్రమంలో ఆ పార్టీ కి కేవలం 2–3 సీట్లు మాత్రమే దక్కుతాయని సర్వే బాంబుపేల్చింది. మొత్తం మీద బీజేపీకి 10 నుంచి 12 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వే స్పష్టం చేసింది. అధికార పార్టీ బీఆర్‌ఎస్ కు 45–51 మధ్య సీట్లు వస్తాయని లోక్ పోల్ సర్వే వెల్లడించింది. బీఆర్‌ఎస్ కు 39 శాతం నుంచి 42 శాతం వరకు ఓట్లు లభిస్తాయని, ప్రతిపక్షంగా ఆ పార్టీ నిలుస్తుందని టాక్.
ఎంఐఎం పార్టీ 6–8 సీట్లకే పరిమితమవుతుందని సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ తప్పక జెండా ఎగరవేస్తుందని సమాచారం. కాంగ్రెస్ కు 61–67 సీట్లు దక్కుతాయని సర్వే తెలపగా, ఆ పార్టీకి 41–44 శాతం ఓట్లు వస్తాయని అంటున్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు పథకాలపై ప్రజల్లో చర్చ జరుగుతోందని.. ఈ పథకాల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని లోక్ పోల్ తేల్చి చెప్పింది.ఈ సర్వేతో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. మరి రానున్న ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…