Minister KTR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. కేసీఆర్ కొద్దివారాలుగా అనారోగ్యానికి గురయ్యారని తెలిసిందే. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే తాజాగా సీఎం కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి పలు వివరాలను వెల్లడించారు మంత్రి కేటీఆర్. శుక్రవారం ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడిన ఆయన…. ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం వైరల్ ఫీవర్, ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడంతో కోలుకోవడానికి అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉందని తెలియజేశారు.
ప్రస్తుతం ఆరోగ్యంగాగనే ఉన్నారని… వేగంగా కోలుకుంటున్నారని చెప్పారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని వ్యాఖ్యానించారు కేటీఆర్.కేసీఆర్ త్వరగా కోలుకోవాలని వీరాభిమానులు, కార్యకర్తలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.మూడు వారాలకుపైగా జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్‌కు ప్రగతి భవన్‌లోనే.. యశోద ఆస్పత్రి నుంచి వచ్చిన ఐదుగురు వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు మరో ఇద్దరు నిపుణులు కూడా దగ్గరుండి కేసీఆర్ ఆరోగ్యాన్ని చూసుకుంటున్నారని తెలియవచ్చింది. కాగా.. కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకో వారం రోజులకు పైగానే పట్టే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగానే 115 మంది అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. ప్రచారం అంతంత మాత్రమే.. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆరు గ్యారెంటీ స్కీములు, సామాజిక వర్గాల వారీగా డిక్లరేషన్లు, జాతీయస్థాయి నేతలతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ముందు వరుసలో ఉంది. మరోవైపు.. బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు రావని కచ్చితంగా హంగ్ వస్తుందని కమలనాథులు చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. హంగ్ తర్వాత బీజేపీదే అధికారమని కూడా ధీమాగా కీలక నేత బీఎల్ సంతోష్ లాంటి వారు చెబుతున్నారు. ఇక కేసీఆర్ అనారోగ్యంతో ఉండటంతో ప్రస్తుతానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు.. ఎమ్మెల్సీ కవిత నియోజవర్గాలు, జిల్లాల వారీగా సభలు, సమావేశాలు పెడుతుండడం ఆసక్తికరంగా మారింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…