కె. బాపయ్య దర్శకత్వంలో ఎన్టీఆర్, వాణిశ్రీ కలిసి నటించిన చిత్రం ఎదురులేని మనిషి. ఈ చిత్రానికి గాను వైజయంతి మూవీస్ సమస్థ నిర్మాణ సారథ్యం వహించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన వాణిశ్రీ ఇంకా అప్పటినుంచి సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నారట. వాణిశ్రీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల వెనుక కారణం ఏమిటి..? అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
ఎదురులేని మనిషి చిత్రం షూటింగ్ టైంలో కృష్ణా ముకుందా మురారి అనే ఓ ఆకతాయి పాట షూటింగ్ జరుగుతోంది. షాట్ గ్యాప్ లో వాణి శ్రీ గారు ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి ఆ పాటలో డాన్స్ మాస్టర్ చూపిస్తున్న మూమెంట్స్ గమనించారా.. ఆ డాన్స్ మూమెంట్స్ చూస్తుంటే నాకు చాలా అభ్యంతరకరంగా ఉంది. కాస్త మీరేనా ఆ డైరెక్టర్ ని పిలిచి చెప్తే బాగుంటుంది కదా అని అన్నారట.
ఎన్టీఆర్ వెంటనే నేను చెప్పను వాణిశ్రీ గారు అని అన్నారట. అదేంటండీ అలా అంటున్నారు అని ప్రశ్నించారట వాణిశ్రీ. దానికి ఎన్టీఆర్ ఇది ఇప్పటి ట్రెండ్. అది తప్పో ఒప్పో చెప్పడానికి మనం ఎవరిమండి అది నిర్మాతల ఇష్టం. మనం నటించమని చెప్పేస్తే వేరే ఎవరినైనా పెట్టి సినిమా తీసేసుకుంటారు వాళ్ళు. డబ్బులు పెట్టేది నిర్మాతలు గనుక ఎలా తీస్తే లాభం వస్తుంది అనే ఆలోచన వాళ్లకు ఉంటుంది.
ఒక సినిమాలో నటించేటప్పుడు నిర్మాతల నిర్ణయాలను మనం కాదనలేము. కాబట్టి మన ముందున్న దారులు రెండే రెండు. ఒకటి నచ్చకపోతే పూర్తిగా సినిమా వదిలేసి వెళ్లిపోవడం. లేకపోతే సర్దుకుపోయి నటించడం. నాకు తెలిసి ప్రస్తుతం మనం రెండోదారి ఎంచుకోవడమే కరెక్ట్ అని నా ఉద్దేశం వాణిశ్రీ గారు అన్నారట ఎన్టీఆర్. మీరు ఒక్కమాట చెబితే వాళ్ళు నిర్ణయాన్ని మార్చుకుంటారేమో అని మరోసారి చెప్పారట వాణిశ్రీ.
వాణిశ్రీ ప్రశ్నకు సమాధానంగా నేను మహా అయితే ఇంకో ఐదారేళ్లు నటిస్తానేమో కాబట్టి వారు చెప్పినట్టు నటించడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చేశాను. కాబట్టి వాళ్లు చెప్పినట్లు ట్రెండ్ ఫాలో అవ్వడం మంచిది అని చెప్పారట. వ్యక్తిగత ఇష్టాలతో ప్రమేయం ఏముంటుంది అని మరింత వివరణ కూడా ఇచ్చారట. ఇక ఎన్టీఆర్ వివరణ పూర్తయిన తర్వాత వాణిశ్రీ ఆలోచనల్లోకి వెళ్లారట. ఇక సినిమాలు మానేయడమే బెటర్ అనే అభిప్రాయానికి ఆమె రావడానికి ఆ సంఘటనే కారణమయ్యిందట. అయితే ఈ విషయాలు వాణిశ్రీ గారే స్వయంగా చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…