Krishna : హీరో కృష్ణ స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని. తెనాలి రత్న థియేటర్ లో చూసిన పాతాళ భైరవి సినిమా కృష్ణ మనసులో చేరగని ముద్ర వేసింది. కృష్ణ చిన్నప్పటి నుంచే ఎన్టీఆర్ ను ఎంతో అభిమానించే వారు. నటుడుగా ప్రయత్నించడానికి చెన్నై వెళ్లినప్పుడు కృష్ణ మొదటగా ఎన్టీఆర్ నే కలిశారు. చిన్న వయస్సు కారణంగా రెండు సంవత్సరాల పాటు నాటకాలలో నటించమని కృష్ణకు సలహా ఇచ్చిందే ఎన్టీఆర్. హీరోగా గుర్తింపు వచ్చిన తరువాత ఎన్టీఆర్, కృష్ణ కలిసి నటించిన మొదటి చిత్రం స్త్రీ జన్మ. వీరు కలిసి నటించిన ప్రతి సినిమాలో కూడా ఎన్టీఆర్ కు తమ్ముడి గానే కృష్ణ నటించారు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరి మధ్య గొడవలు రావడం.. చాలా కాలం మాట్లాడుకోకుండా ఉండడం కూడా జరిగింది. వీరిద్దరి మధ్య గొడవలు రావడానికి పరిస్థితులే కారణమని చెప్పవచ్చు.
దేవుడు చేసిన మనుషులు చిత్రం ప్రారంభం కావడానికి ముందు జరిగిన కొన్ని సంఘటనలే వీరిద్దరి మధ్య గొడవలకు కారణమయ్యాయని చెప్పవచ్చు. పండంటి కాపురం చిత్ర వేడుకలల్లో ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ వేడకలల్లోనే కృష్ణ తన అభిమాన నటుడితో సినిమా తీయాలని కోరగానే దానికి ఎన్టీఆర్ సరే అన్నారు. పండంటి కాపురం చిత్ర సమయంలోనే జై ఆంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంది. అప్పటి పరిస్థితులను చూసి చలించిపోయిన కృష్ణ ఆ ఉద్యమానికి తన మద్దతును ప్రకటిస్తూ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. ఈ విషయం పై తటస్థ వైఖరిని అవంలంభిస్తున్న ఎన్టీఆర్, ఏఏన్ఆర్ లకు కృష్ణ వైఖరి నచ్చలేదు. దీంతో కృష్ణతో కలిసి సినిమా చేయనని ఎన్టీఆర్ ప్రకటించారు.
ఆవేశంలో అలా మద్దతు ఇచ్చానని కృష్ణ చెప్పినా కూడా ఎన్టీఆర్ వినిపించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి ఆత్మకూరులో జరిగే హరికృష్ణ వివాహానికి రావల్సిందిగా కృష్ణ ను ఆహ్వానించారు. దీంతో విజయ నిర్మల, కృష్ణ దంపతులు ఆ వివాహానికి హాజరయ్యారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగి దేవుడు చేసిన మనుషులు సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. ఆ చిత్రం పూర్తి కాగానే తన తదుపరి చిత్రం అల్లూరి సీతారామరాజు అని కృష్ణ ప్రకటించారు. ఈ చిత్రాన్ని తానే తీస్తానని ఎన్టీఆర్ చాలా సార్లు ప్రకటించినప్పటికీ ఎన్టీఆర్ ఈ సినిమాను తీయలేదు. కృష్ణ చేసిన ప్రకటనను చూసి కోపగించుకున్న ఎన్టీఆర్.. దేవుడు చేసిన మనుషులు సినిమా 100 రోజుల వేడుకకు హాజరవ్వ లేదు.
ఈ సినిమా కారణంగా కృష్ణ, ఎన్టీఆర్ ల మధ్య దూరం మరింత పెరిగింది. వీళ్లిద్దరి మధ్య చాలా రోజులు మాటలు కూడా లేవు. అయినప్పటికీ ఒకసారి వారాహి స్టూడియోస్ లో కృష్ణ, ఎన్టీఆర్ ఒకరికి ఒకరు ఎదురు పడ్డారు. కృష్ణ వెళ్లి పలకరించగానే ఎన్టీఆర్ కూడా మాట్లాడారు. అల్లూరి సీతారామ రాజు సినిమాను చూసి బాగా తీశావని కృష్ణను ప్రశసించారు ఎన్టీఆర్. ఆ తరువాత ఎన్టీఆర్ తీసిన దాన వీర శూర కర్ణ సినిమాకు పోటీగా కృష్ణ కురుక్షేత్రం సినిమాను తీశారు. దీంతో చిత్ర పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయింది. ఈ రెండు చిత్రాలు కూడా 1977 లో సంక్రాంతికి పోటాపోటీగా విడుదలయ్యాయి. ఈ సినిమాల తర్వాత అప్పడప్పుడూ వీళ్లిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. చాలా కాలం వరకు వీరిద్దరి మద్య ఎటువంటి గొడవలు లేవు.
ఇద్దరూ కలిసి వయ్యారి భామలు వగలమారి భర్తలు అనే సినిమాలో కూడా నటించారు. ఆ తరువాత ఎన్టీఆర్ రాజకీయాలలోకి వెళ్లడం తెలుగు దేశం పార్టీని స్థాపించడం, ఆ పార్టీ గుర్తుగా సైకిల్ ను ఎంచుకోవడం చకచకా జరిగిపోయాయి. అదే సమయంలో కృష్ణ ఈనాడు సినిమాలో రండి కదలరండి అనే పాటను సైకిళ్ల మీద తీయడంతో ఎన్టీఆర్ కు మద్దతుగా అలా తీశారేమో అని అందరూ అనుకున్నారు. ఎన్టీఆర్ ను అభినందిస్తూ కృష్ణ పేపర్ లో ప్రకటన కూడా ఇచ్చారు. ఈ తరువాత కొంత కాలం ఇద్దరూ బాగానే ఉన్నారు.
1984 లో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ను కాంగ్రెస్ పార్టీ సహకారంతో బలవంతంగా గద్దె దించి నాదెళ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి కాగానే ఆయనను అభినందిస్తూ కృష్ణ ప్రకటనలు ఇవ్వడంతో పెద్ద దుమారమే రేగింది. ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహించి కృష్ణ సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్లపై దాడి చేశారు. ఆయన పోస్టర్ లను తగలబెట్టారు. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక కృష్ణ మరుసటి రోజే మరో ప్రకటనను విడుదల చేశారు. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కానని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరూ ఉన్న వారికి నా అభినందనలు తెలపడం నాకు అలవాటు, నేను ఎవరి మీద కోపంతోనూ ఆ ప్రకటనను ఇవ్వలేదు.. అని ప్రకటించడంతో ఆ గొడవ తగ్గింది. అయినప్పటికీ ఈ పరిణామాలు చూసిన నిర్మాతలు కృష్ణ సినిమాల విడుదలను వాయిదా వేశారు. మళ్లీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా కృష్ణ దాడులను ఎదుర్కోవలసి వచ్చింది. 1984 లో ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ సలహా మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు కృష్ణ. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ వ్యంగ్య చిత్రాలను తీశారు కృష్ణ. రాజీవ్ గాంధీ మరణాంతరం వీరిద్దరి మధ్య ఎటువంటి గొడవలు జరగలేదు. ఇవీ.. కృష్ణ, ఎన్‌టీఆర్‌ల మధ్య ఉన్న గొడవలు.. సంబంధాలు.. చిత్రాలకు చెందిన అసలు విషయాలు..!
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…