Nuts : రాత్రి నుంచి ఉదయం వరకు సహజంగానే మన కడుపు మొత్తం ఖాళీగా ఉంటుంది. అందుకనే ఉదయం నిద్ర లేవగానే చాలా మందికి ఆకలి వేస్తుంది. దీంతో నిద్ర లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని బ్రష్ చేసి వెంటనే టిఫిన్ లాగించేస్తుంటారు. అయితే వాస్తవానికి టిఫిన్ కన్నా ముందు మనం కొన్ని ఆహారాలను తీసుకోవాలి. వీటిని ఖాళీ కడుపుతో రోజూ తినాలి. ఇలా తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదంలో విటమిన్ ఇ తోపాటు మాంగనీస్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అయితే బాదం తినడానికి ఒక పద్ధతుంది. బాదంని డైరెక్టుగా తినడం వల్ల ఈ విటమిన్లు శరీరానికి అందవు. రాత్రిపూట బాదంలని నానబెట్టి, తెల్లారి లేవగానే దాని పొట్టు ఊడదీసి తినాలి. ఇలా తింటేనే మనకు లాభాలు కలుగుతాయి. పోషకాలు లభిస్తాయి. అలాగే పొద్దున్న లేవగానే వేడినీళ్ళలో తేనె కలుపుకుని తాగితే జీవక్రియ పనితీరు మెరుగవుతుంది. అంతేకాదు శరీరంలోని విష పదార్థాలని బయటకు పంపించివేస్తుంది. కనుక ఉదయం ఖాళీ కడుపుతో తేనెను కూడా తీసుకోవాలి.
ఇక కిస్మిస్ లలో పొటాషియం, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. బాదంలలాగే వీటిని కూడా నానబెడితే శరీరానికి మంచిది. వీటిలో ఉండే సహజసిద్ధమైన చక్కెర శరీరానికి మంచి ఎనర్జీ ఇస్తుంది. అందువల్ల కిస్మిస్‌లను రాత్రి పూట నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే మనకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే శరీరంలో ఉన్న విషపదార్థాలని బయటకు పంపించడంలో బొప్పాయి ప్రముఖ పాత్ర వహిస్తుంది. శరీరంలో కొవ్వుని తగ్గించి గుండెకి సంబంధించిన రోగాలను రాకుండా చూసుకుంటుంది. కనుక ఉదయం పరగడుపునే బొప్పాయి పండు ముక్కలను ఒక కప్పు మోతాదులో తినాలి. తరువాత 45 నిమిషాల వరకు ఏమీ తినరాదు. దీంతో ఈ ఆహారాల వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…