Kalki 2898AD : క‌ల్కి మిడ్ నైట్ షోస్ క్యాన్సిల్ చేయ‌డం వెనుక అస‌లు కార‌ణం ఇదా..?

Kalki 2898AD : టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా సినిమా కల్కి 2898 ఏడి. మ‌రికొద్ది గంట‌ల‌లో ఈ సినిమా విడుద‌ల కానుంది. సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీస్ దీపిక పడుకొనే, దిశా పటాని, మాళవిక నాయర్ నటించారు. సీనియర్ నటులు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, శోభన, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. అశ్విన్ దత్ నిర్మాతగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇటీవ‌ల సినిమా నుంచి కల్కి థీమ్ సాంగ్ విడుదల అయ్యింది. ఈ పాట చాలా ఎమోషనల్ గా ఉంది. కాల భైరవ మరొకసారి తన వాయిస్ తో ఆకట్టుకున్నాడు.

రిలీజ్ కు ముందు.. మేకర్స్ వినూత్నంగా ప్రమోషన్స్ చేయడంతో వేరే లెవెల్ లో హైప్ క్రియేట్ అయింది. హాలీవుడ్ రేంజ్ లో మూవీ ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. రోజుకు ఐదు షోలు కూడా వేసుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు తెలంగాణ సర్కార్ కూడా అలానే పర్మిషన్ ఇచ్చింది. ఉదయం 5.30 గంటలకు స్పెషల్ వేసుకునేందుకు జీవో జారీ చేసింది. కాగా.. కల్కి సినిమా మిడ్ నైట్ షోస్ పడతాయని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 5.30 గంటలకు ఫస్ట్ షో పడనుంది. ఇప్పుడు కల్కి సినిమా మిడ్ నైట్ షోస్ వేయకపోవడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

this is the reason why Kalki 2898AD mid night shows cancelled
Kalki 2898AD

అర్థరాత్రి షోస్ వేస్తే ఎక్కువ మంది యువకులే థియేటర్లకు వస్తారు. అదే సమయంలో కొందరు ఆకతాయిలు.. మద్యం సేవించి వచ్చి థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తారని కొందరు చెబుతున్నారు. కాబట్టి మిడ్ నైట్ షోస్ వేయకపోవడం బెటర్ అని అంటున్నారు. కల్కి సినిమా.. భారత పురాణాల స్ఫూర్తితో నాగ్ అశ్విన్ తెరకెక్క‌గా, ఈ సినిమాని మిడ్ నైట్ చూశాక‌ కొందరికి ఏమైనా చిన్న విషయం అర్థం కాకపోయినా సరే.. సోషల్ మీడియాలో తప్పుగా పోస్ట్ చేసేస్తారు. దీంతో ఆ పోస్టులు సినీ ప్రియులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. కాబట్టి పొద్దున్న ఫ్రెష్ మైండ్ తో సినిమా చూస్తే ఈజీగా క్లారిటీగా అర్థమవుతుందని మేకర్స్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ బాహుబలి మూవీకి కూడా అర్థరాత్రి నెగెటివ్ రివ్యూలు వచ్చిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు మిడ్ నైట్ షోస్ క్యాన్సిల్ చేసిన‌ట్టు తెలుస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago