OTT : బాలీవుడ్ మిస్టర్ పర్పెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ప్రతి సినిమాలో కూడా వైవిధ్యం చూపించి తనదైన నటనతో మెప్పించారు. ఇప్పుడు ఆయన తనయుడు జునైద్ ఖాన్ నటించిన మొదటి సినిమా ‘మహారాజ్’. అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా చాలా సమస్యలను ఎదుర్కొంది. ఈ సినిమా విడుదల చేయకూడదని చాలా మంది ఆందోళనలు, నిరసనలు నిర్వహించారు. ఎట్టకేలకి ఈ చిత్రం విడుదల కాగా, ఈమూవీ జూన్ 21న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ‘మహారాజ్’ సినిమా చూడాల్సిందిగా నిర్మాత జడ్జిని అభ్యర్థించారు.
ఈ పిటిషన్‌కు అంగీకరించిన న్యాయమూర్తి.. హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశాలు ఇందులో లేవని సినిమా చూసిన తర్వాత చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది. అయితే ఓటీటీలో ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. హిందీతో పాటు తెలుగు తదితర దక్షిణాది భాషల్లోనూ మహారాజ్ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.అయితే స్ట్రీమింగ్‍కు వచ్చిన ఐదు రోజుల్లోనే అగ్రస్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మహారాజ్ చిత్రంపై గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చిత్రం తమ మనోభావాలను కించపరిచేలా అభ్యంతరకంగా ఉందని, రిలీజ్ ఆపాలని ఓ హిందూ సంఘం పిటిషన్ వేయడంతో జూన్ 14న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సిన ఈ చిత్రం కాస్త ఆలస్యంగా జూన్ 21న స్ట్రీమింగ్‍కు వచ్చింది.
బాలీవుడ్‌లోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘యష్ రాజ్ ఫిల్మ్స్’ సంస్థ ‘మహారాజ్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. జునైద్ ఖాన్‌కి ఇది మొదటి సినిమా. ఈ సినిమాలో ‘పాతాల్ లోక్’ ఫేమ్ జైదీప్ అహ్లావత్ కూడా కీలక పాత్రలో నటించారు. కాగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశాలు మహారాజ్ సినిమాలో ఉన్నాయని కొందరు కేసు పెట్టారు. బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తెరంగేట్రం చేశారు. ‘మహారాజ్’ అనే పీరియాడిక్ బయోపిక్ మూవీతో సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1800ల బ్యాక్‍డ్రాప్‍తో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రముఖ పాత్రికేయుడు, సంఘ సంస్కర్త కరందాస్ ముల్జీ జీవితంపై ఈ చిత్రం తెరకెక్కింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…