Kalki 2898AD Movie Review : గత కొద్ది రోజులుగా కల్కి 2898 ఏడీ గురించే చర్చ నడుస్తుంది. ఈ మూవీపై ఉన్న బజ్ అంతా ఇంతా కాదు. వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రేక్షకులు కొన్ని నెలలుగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. కల్కి 2898 ఏడీ జూన్ 27న అట్టహాసంగా రిలీజ్ అయింది. ఈ సినిమా కథ మహాభారతంంలో ధర్మరాజు ఆడిన అబద్ధంతో మొదలవుతుంది. అశ్వథ్థామ, కల్కి ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో సుమతి అనే మహిళకడుపున కల్కి జన్మించబోతున్నాడని తెలిసి అశ్వత్థామ సంరక్షుడిగా మారతాడు. అయితే కాంప్లెక్స్ లోకి వెళ్లేందుకు 1 మిలియన్ యూనిట్స్ కోసం వెతుకుతున్న భైరవ, సుమతిని పట్టుకొస్తే ఆ యూనిట్స్ దక్కుతాయని తెలుసుకుంటాడు. అప్పుడు భైరవ.. అశ్వథ్తామని ఎదురించి సుమతిని పట్టుకొచ్చాడా? సుమతితో అతనికి ఏం పని? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంత ఎలా ముడిపడింది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్రభాస్ తన నటనతో కుమ్మేశాడు. దీపికా, కమల్, అమితాబ్ కూడా తమ విశ్వరూపం చూపించారు. ఇతరులు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. అయితే నాగ్ అశ్విన్ ఇలాంటి సినిమా తీసాడంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. టేకింగ్, ప్రజంటేషన్ అదుర్స్. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇలా ప్రతి విభాగం సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇలాంటి సినిమాలు హాలీవుడ్‌లో చూసి ఉంటాం కాని తెలుగు తెరపై చూడడం ఇదే తొలిసారి ఫస్టాఫ్ 40 నిమిషాలు ముగిసిన తర్వాత అసలు కథ ఏంటనేది అర్ధం అవుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చాడు నాగ్ అశ్విన్. సెకండాఫ్‌లో వచ్చే కురుక్షేత్రం సీన్స్ సినిమాకి ప్రధాన హైలైట్. ఒకే మూసతో నడిచే తెలుగు సినిమాలు చూసి బోర్ గా ఫీలైన ఆడియన్స్‌కి ఈ సినిమా మాంచి కిక్ ఇస్తుంది. మూవీని గేమ్ ఛేంజర్ ఇన్ ఇండియన్ సినిమాగా కూడా చెప్పొచ్చు.
సినిమా ప్లస్ పాయిట్స్ చూస్తే నాగ్ అశ్విన్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, హాలీవుడ్ రేంజ్ విజువల్స్, ప్రభాస్, కమల్ హాసన్ ,అమితాబ్, గెస్ట్ అప్పియరెన్స్ , కురుక్షేత్రం ఎపిసోడ్. ఇక నెగెటివ్ చూస్తే.. మొదటి 40 నిమిషౄలు మాస్ ఆడియన్స్‌కి పెద్దగా కనెక్ట్ కాకపోవడం, దీపికా పదుకొణే డబ్బింగ్, ఎమోషనల్ కనెక్ట్ కాస్త మిస్ కావడం. మొత్తంగా చూస్తే ఈ సినిమా మాత్రం ప్రేక్షకులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించే సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే.. హాలీవుడ్ రేంజ్ .. నాగ్ అశ్విన్ ఇప్పటివరకు సినిమా గురించి చాలా తక్కువ చెప్పారు. ఒక్కసారి థియేటర్లోకి అడుగు పెట్టిన తర్వాత మరో ప్రపంచంలోకి వెళ్లినట్లే ఉందని ప్రతి ఒక్కరు అంటారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…