Kalki 2898AD : పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ బాహుబలితో పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ పలు సినిమాలు చేయగా , అవి పూర్తిగా నిరాశపరిచాయి. చివరగా నటించిన సలార్ పెద్ద విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న కల్కి సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు ఫ్యాన్స్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే తదితర భారీ తారాగణం ఈ సినిమాలో భాగమైంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో దీన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మించారు.
ప్రస్తుతం ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ సినిమా గురించి ప్రముఖ జ్యోతిష్యుడు పండిత్ జగన్నాథ్ గురూజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ కల్కి ఊహించినస్థాయిలో హిట్ అవదని, సినిమాకు రావాల్సిన కలెక్షన్లు మాత్రం మినిమంగానే వస్తాయన్నారు. సినిమాకు పెట్టిన బడ్జెట్ మాత్రం తిరిగివస్తుందన్నారు. ప్రభాస్ జాతకంలో రెండు సంవత్సరాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభాస్ గత సినిమాలు ఫ్లాప్ కావడానికి కూడా కారణం ప్రభాస్ గ్రహస్థితి అని ఆయన చెప్పారు. అయితే రణ్వీర్ సింగ్ ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని’ సినిమా బాక్సాఫీస్ హిట్ అవుతుంది అని అంచనా వేయగా అది 200 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. గతంలో పలు సినిమాలకి ఆయన చెప్పిన ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమా గురించి ఆయన చెప్పింది నిజం అవుతుందా అని అందరు ఆందోళన చెందుతున్నారు.
అయితే కల్కి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రేంజ్ సక్సెస్ కాకపోవచ్చని తేల్చేసారు.భారీ వసూళ్లు అయితే ఈ సినిమాకి రాకపోవచ్చని పెట్టిన బడ్జెట్ ని మాత్రం రికవర్ చేయగలుగుతుంది అని అతను అంచనా వేశారు. అంతే కాకుండా ఈ సినిమా విషయంలో గ్రహాల స్థితిగతులు సరిగా లేవని ఇంకా ప్రభాస్ మళ్ళీ భారీ హిట్ అందుకోవడానికి ఇంకో రెండేళ్ల సమయం పడుతుంది అని కూడా అంచనా వేశారు. సినిమాని సరైన దారిలో నడిపించేంది దీపికా గ్రహస్థితి అని, ప్రభాస్ కాదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…