Nagarjuna : అక్కినేని నాగార్జున పెద్దగా వివాదాల జోలికి వెళ్లడు. కొన్నిసార్లు కావాలనే కొందరు వివాదాలలో నిలిచేలా చేస్తారు. బిగ్ బాస్ సమయంలో నాగార్జునని దారుణంగా విమర్శించడం మనం చూశాం. అయితే ఆ సమయంలో నాగార్జున స్పందించింది లేదు. ఇక ఇటీవల నాగార్జున బాడీగార్డ్ ఆయన అభిమానిని తోసేయడంతో కిందపడిపోయాడు. ఆ వీడియో వైరల్ కాగా, పెద్ద వివాదాస్పదం అయింద. అప్పుడు నాగార్జున క్షమాపణలు కూడా చెప్పాడు. నాగార్జున ముంబయి ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి వస్తుండగా అనుకోని ఘటన జరిగింది. ఎయిర్‌పోర్ట్‌లో నాగార్జునతో పాటు ధనుష్ నడుచుకుంటూ వస్తుండగా.. అక్కడే షాపులో పనిచేస్తున్న ఓ అభిమాని నాగ్‌ను కలిసేందుకు ముందుకు వచ్చాడు.
దీంతో ఆ అభిమాని వికలాంగుడు అని కూడా చూడకుండా సెక్యురిటీ గార్డ్ అతడిని గట్టిగా పక్కకు తోసేశాడు. కిందపడబోయిన అతడు తమాయించుకుని నిలబడ్డాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. దీంతో మానవత్వం ఏమైపోయింది అంటూ నెటిజన్లు నాగార్జునను విమర్శించారు. అయితే ఈ వివాదం నాగ్ దృష్టికి కూడా వెళ్లింది. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఇలాంటిది జరగకుండా ఉండాల్సింది. ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నాను. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటాను అంటూ నాగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇక తాజాగా ఆ అభిమానిని నాగార్జున డైరెక్టుగా కలిశారు. మళ్లీ క్షమాపణలు చెప్పారు. అలాగే హగ్ చేసుకొని, ఒక సెల్ఫీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు కింగ్ నాగార్జునపై ప్రశంసలు కురిపిస్తున్నారు. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న చిత్రం కుబేరలో నాగార్జున నటిస్తున్నారు. ధనుష్ హీరోగా నటిస్తుండగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్. కింగ్ నాగార్జున కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయిలోని పలు ప్రాంతాల్లో జరుపుకుంటుంది. ఇటీవల జూహు బీచ్‌లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్‌మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…