Kalki 2898AD First Day Collections : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది. కల్కి సినిమా భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు, అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలతో ప్రేక్షకులని మెప్పించింది. కలియుగాంతానికి, మహాభారతానికి లింక్ పెట్టి నాగ్ అశ్విన్ అదిరిపోయే విజువల్స్ తో హాలీవుడ్ రేంజ్ లో కల్కి సినిమాను చూపించడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.పురాణాలకు, కలియుగాంతానికి, కల్కి అవతారానికి లింక్ పెట్టి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సృష్టించారు.
చిత్రంలో అద్భుతమైన ప్రపంచం.. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి అడియన్స్ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు. కల్కి 2898 ఏడి మైండ్ బ్లోయింగ్ మూవీ అంటూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆలోచన, మేకింగ్ పై కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం నెవర్ బిఫోర్ ఇండియన్ సినిమా రిలీజ్ గా వచ్చింది అని చెప్పాలి. యూఎస్ మార్కెట్ లో ఈ చిత్రం లేటెస్ట్ గా భారీ వసూళ్లు అందుకుని ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుంది.
ఈ సినిమాకి నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ కి జరిగిన ప్రీ సేల్స్ లో అలాగే రిలీజ్ రోజు వసూళ్లు కలిపి ఒక ఆల్ టైం రికార్డు నెంబర్ నమోదు అయ్యినట్టుగా వినిపిస్తుంది. కేవలం ఈ చిత్రం ప్రీమియర్స్ కే దాదాపు 4 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని అందుకోగా మొదటి రోజుకి గాను 1.59 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకుంది. ప్రీమియర్స్, మొదటి రోజు కలిపి కల్కి సినిమా అమెరికాలో 5.8 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ సాధించింది. అంటే మన లెక్కల్లో చెప్పాలంటే దాదాపు 40 కోట్లకి పైగానే కలెక్ట్ చేసింది. ఇక హిందీ వర్షెన్‌కి 24 కోట్లు రాబట్టినట్టు తెలుస్తుండగా, కర్ణాటక, తమిళనాడులో ఈ చిత్రం రూ.4 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తుంది.”కల్కి 2898 AD” చిత్రం ప్రధానంగా నిజాం, ఓవర్సీస్ మరియు ఇతర భారతీయ రాష్ట్రాలలోని అర్బన్ ఏరియాలలో మంచి రెస్సాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రం నైజాంలో మొదటి రోజు దాదాపు 16.3 కోట్ల రూపాయలను వసూలు చేసింది. సీడెడ్‌లో రూ. 5.5 కోట్ల షేర్ వసూలు చేసింది. వైజాగ్ రీజియన్ రూ. 4.5 కోట్లు వసూలు చేసింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…