Vijay Devarakonda : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కల్కి’ కాగా, ఈ చిత్రానికి ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాల ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అంతటా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు బారులుతీరున్నారు. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో పాటు దుల్కర్ సల్మాన్ ఉన్నట్లు మేకర్స్ రిలీజ్‌కి ముందే ప్రకటించారు. దాంతో రౌడీ ఫ్యాన్స్ విజయ్ ఏ పాత్రలో నటించబోతున్నాడు అని వెయ్యి కండ్లతో ఎదురుచూశారు.
అయితే కల్కి చిత్రం రిలీజ్ తర్వాత .. విజయ్ ఏ పాత్రలో నటించాడో తెలిసిపోయింది. విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపించి మెప్పించాడు. సినిమాలో విజయ్‌కు సంబంధించిన సీన్స్ ఆకట్టుకున్నాయి. అశ్వత్థామపై(అమితాబ్) యుద్ధం చేస్తున్న సమయంలో సంభాషణ చెబుతూ విజయ్ కనిపించగా.. ఇది చూసిన సినీ ప్రియులు విజయ్ లుక్, డైలాగ్ డెలివరీ అదిరిపోయిందని తెగ ప్రశంసిస్తున్నారు. మరో వర్గం మాత్రం విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ పై విమర్శల వర్షం కురుస్తుంది. అతని లుక్.. ఓకే అనిపించినా, డైలాగ్ డెలివరీ కామెడీగా ఉందని, ‘అశ్వద్ధామ’ అంటూ అతను పిలిచినప్పటికీ.. ‘అమిత్’ అంటూ అతని బ్రాండ్ డైలాగ్ తో అరిచినట్టే ఉందని, తెలంగాణ అర్జునుడు అంటూ విజయ్ దేవరకొండ పాత్ర పై ట్రోల్స్ వస్తున్నాయి.
ఎందుకు విజయ్ దేవరకొండ మీద ఇంత నెగెటివిటీ క్రియేట్ చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. మరోవైపు చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన దుల్కర్ సల్మాన్ ప్రభాస్‌ను చిన్నప్పుడు కాపాడి పెంచిన ఓ యోధుడి పాత్రలో కనిపించాడు. ఇంకా టాలీవుడ్ దిగ్గజ దర్శకులు రాజమౌళి, రామ్ గోపాల్‌వర్మ కూడా అతిథి పాత్రల్లో మెరిశారు. మంచి టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాల్లో మైనస్‌లు లేవా అంటే.. కాదు అని చెప్పడానికి లేదు. కొన్ని చోట్ల సినిమా ఫ్లాట్ గా అనిపిస్తుంది. అలాగే అక్కడక్కడా లెంగ్త్ ఉన్న సీన్స్ కూడా ఉండటం ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…