Chiranjeevi : స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ఎంతో మంది స్పూర్తి. ఆయనని చూసి ఇండస్ట్రీకి చాలా మంది హీరోలు వచ్చారు. ఇప్పటికీ కుర్రహీరోలకి పోటీగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్న చిరంజీవి సంక్రాంతికి వాల్తేరు వీరయ్య చిత్రంతో పలకరించబోతున్నాడు. అయితే చిరు తన కెరీర్ మొదట్లో విలన్ గా నటించి మెప్పించి ఆ తరవాత హీరో పాత్రలు చేసిన విషయం తెలిసిందే. చిరు హీరోగా ఎదుగుతున్న తీరు ఆయన క్రమ శిక్షణ చూసి ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య తన కుమార్తె సురేఖను ఇచ్చి వివాహం చేశారు. అయిత చిరు ఓ తప్పు చేసుంటే అసలు అల్లు వారి ఫ్యామిలీకి అల్లుడు అయ్యిండే వాడు కాదట.
చిరంజీవిని తన అల్లుడిగా చేసుకునే ముందు అల్లు రామలింగయ్య చాలా ఎంక్వైరీలు చేశాడట. తన కుమారుడు అరవింద్ ను పిలిచి చిరు గురించి తెలుసుకోవాలని ఆరా తీయాలని చెప్పడంతో.. అల్లు అరవింద్ చిరుతో పనిచేసిన పలువురు నటీనటులను దర్శకనిర్మాతలను కలిసి ఆరా తీసారు. దాంతో ప్రతిఒక్కరూ మెగాస్టార్ గురించి గొప్పగా చెప్పారట. దీంతో ఇదే విషయాన్ని అరవింద్ తన తండ్రికి చెప్పాడు. ఇక చిరంజీవి అల్లు రామలింగయ్య ఓ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ నుండి చెన్నైకి ట్రైన్ లో ప్రయాణించారట.
ఆ రోజున అల్లు రామలింగయ్య వైన్ గ్లాస్ తీసుకుని చిరంజీవిని తాగమని చెప్పగా, ఆయన తనకు అలవాటు లేదని చెప్పారట. దాంతో అల్లు రామలింగయ్య అప్పుడే చిరు తన అల్లుడు అని ఫిక్స్ అయ్యారట. ఒకవేళ చిరు అల్లు రామలింగయ్య ఆఫర్ చేసిన వైన్ తాగి ఉంటే రామలింగయ్య మరో నిర్ణయం తీసుకొని ఉండేవారేమో అని కొందరు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే చిరుని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. ఇప్పుడు బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ మధ్య మెగాఫ్యామిలీ అల్లు కుటుంబం మధ్య మనస్పర్థలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాటికి అల్లు అరవింద్ చెక్ పెట్టిన విషయం విదితమే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…